Aadi Saikumar : రిలీజ్ డేట్ ఆల‌స్యం కారణంగా నా సినిమాలకు నష్టం వచ్చింది : హీరో ఆది సాయికుమార్

Aadi Saikumar : రిలీజ్ డేట్ ఆల‌స్యం కారణంగా నా సినిమాలకు నష్టం వచ్చింది : హీరో ఆది సాయికుమార్
Aadi

ఆది సాయి కుమార్ కథానాయకుడిగా నటించిన అతిథి దేవోభవ' జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. శ్రీనివాస సినీ క్రియేషన్స్‌పై రాజబాబు మిర్యాల,

Rajeev Rayala

|

Jan 05, 2022 | 8:46 PM

Aadi Saikumar : ఆది సాయి కుమార్ కథానాయకుడిగా నటించిన అతిథి దేవోభవ’ జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. శ్రీనివాస సినీ క్రియేషన్స్‌పై రాజబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మించారు. పొలిమెర నాగేశ్వర్ దర్శకత్వం వహించిన ఇందులో నువేక్ష కథానాయిక. తాజాగా హీరో ఆది ఈ చిత్రం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. నా నటన అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. స్క్రిప్ట్‌లో అంతర్లీన భావోద్వేగ అంశం ఉంది. నా రాబోయే సినిమాలు డిఫరెంట్ జోనర్‌లకు చెందినవి. సినిమాలు బాగా ఆడతాయని నమ్మకం ఉంటేనే ఒప్పుకుంటున్నాను అన్నారు. అలాగే  నా సినిమాల్లో కొన్ని రిలీజ్ డేట్ ఆల‌స్యం కారణంగా నష్టపోయాయి. ‘రఫ్’, ‘చుట్టాలబ్బాయి’ చిత్రాలకు సరైన డేట్స్ వచ్చాయి.

ఇక తాజా సినిమా ఎగ్జిక్యూషన్ పార్ట్‌ని దర్శకుడు చాలా బాగా హ్యాండిల్ చేసిన ‘అతిథి దేవోభవ’పై నాకు నమ్మకం ఉంది. పాటలు కూడా సినిమాలో బాగా వర్కవుట్ అవుతాయి. శేఖర్ చంద్ర గారి పాటలు మరియు బీజీఎమ్ చాలా బాగా వచ్చాయి. భవిష్యత్తులో మళ్లీ ఆయనతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్న వేళ మా సినిమా తెరకెక్కుతున్న మాట వాస్తవమే. వచ్చే శనివారం రెండో శనివారం కావడంతో వారాంతంలో కలెక్షన్లు పెరుగుతాయని ఆశిస్తున్నాను. అలాగే  తర్వాత రాబోతున్న ‘తీస్ మార్ ఖాన్స‌లో పాయల్ రాజ్‌పుత్ కథానాయికగా నటించింది. ఫ్యామిలీ ఎమోషనల్ ప్లాట్ పాయింట్‌తో కూడిన పూర్తి కమర్షియల్ సినిమా. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. వీఎఫ్‌ఎక్స్‌తో కూడిన ‘అమరన్ ఇన్ ది సిటీ’ అనే ఫ్రాంచైజీ సినిమా చేస్తున్నాను. అవికా గోర్ కూడా నటించిన కంటెంట్ ఆధారిత సినిమా ఇది. ‘బ్లాక్’ ఒక థ్రిల్లర్, దీని షూటింగ్ పూర్తయింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘సిఎస్‌ఐ సనాతన్’ షూటింగ్ 10 రోజుల్లో పూర్తవుతుంది. సంక్రాంతికి కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది రొమాంటిక్ సినిమా. ‘జంగిల్’ తెలుగు-తమిళ చిత్రం, దీని అవుట్‌పుట్ అద్భుతంగా ఉంది అని చెప్పుకొచ్చాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: చిరునవ్వులతో ముద్దులొలికే ఈ చిన్నారి వరుస హిట్స్‌తో దూసుకుపోతోంది.. ఎవరో గుర్తుపట్టారా.!

Megastar Chiranjeevi: సేనాపతిపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు.. రాజేంద్రప్రసాద్ నటనపై ఆసక్తికర కామెంట్స్..

Pushpa: ఇట్స్ అఫీషియల్.. అమెజాన్ ప్రైమ్‏లో పుష్ప.. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన మేకర్స్..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu