హెబ్బాకి..ఏమైందబ్బా?

కుమారి 21ఎఫ్ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది హీరోయిన్ హెబ్బా పటేల్. ఒకే ఒక్క సినిమా అమ్మడు కెరీర్‌కు వరస విజయాలను అందించింది. బోల్డ్ అండ్ క్యూట్ లుక్స్‌తో హెబ్బా కుర్రకారు మతి పొగొట్టేసింది. ఆ ఒక్క సినిమా అమ్మడికి బోలెడన్నీ అవకాశాల్ని తెచ్చిపెట్టింది. అయితే ఆ తర్వాత తనకు అచ్చొచ్చిన హీరో రాజ్ తరుణ్‌తో చేసిన ఈడోరకం, ఆడోరకం..నిఖిల్‌తో చేసిన ఎక్కడికి పోతావు చిన్నవాడా తప్ప ఏ మూవీ కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. వీటిలో […]

  • Ram Naramaneni
  • Publish Date - 6:05 pm, Sat, 15 June 19
హెబ్బాకి..ఏమైందబ్బా?

కుమారి 21ఎఫ్ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది హీరోయిన్ హెబ్బా పటేల్. ఒకే ఒక్క సినిమా అమ్మడు కెరీర్‌కు వరస విజయాలను అందించింది. బోల్డ్ అండ్ క్యూట్ లుక్స్‌తో హెబ్బా కుర్రకారు మతి పొగొట్టేసింది. ఆ ఒక్క సినిమా అమ్మడికి బోలెడన్నీ అవకాశాల్ని తెచ్చిపెట్టింది. అయితే ఆ తర్వాత తనకు అచ్చొచ్చిన హీరో రాజ్ తరుణ్‌తో చేసిన ఈడోరకం, ఆడోరకం..నిఖిల్‌తో చేసిన ఎక్కడికి పోతావు చిన్నవాడా తప్ప ఏ మూవీ కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. వీటిలో కూడా తను వేసింది సెకండ్ హీరోయిన్ వేషాలే. వెల్లువలా తనవైపు వచ్చిన ఏ ఆఫర్ ని అస్సలు విడిచిపెట్టలేదు హెబ్బా. అయితే ఈ నిర్ణయాల తనకి ప్లస్ అయ్యిందా.. మైనస్ అయ్యిందా? అన్నది విశ్లేషిస్తే దాని వల్ల హెబ్బాకి పెద్ద డ్యామేజ్ జరిగిందనే తాజా సీన్ చెబుతోంది.

ఆ ప్రభావం తన కెరీర్ పై గట్టిగానే పడింది. ఆ క్రమంలోనే 24 కిస్సెస్ అంటూ మరో బోల్డ్ సినిమాతో సత్తా చాటాలని ఆశించింది. కానీ ఆ కంటెంట్ తో ఇక్కడ ఎక్కువకాలం నెగ్గుకు రాలేమని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. తెలిసి చేసిన తప్పునో.. లేక స్వయంకృతమో మొత్తానికి హెబ్బా కెరీర్ కి బిగ్ బ్రేక్ పడిపోయిందని అర్థమవుతోంది. 24 కిస్సెస్ తర్వాత హెబ్బాకు  వేరొక ఆఫర్ లేనేలేదు. దీంతో కెరీర్ పూర్తిగా డీలా పడిపోయిందని అర్థమవుతోంది. మరి అమ్మడికి కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చేలా మరో మంచి హిట్ ఇప్పుడు  చాలా అవసరం. మరి ఏ డైరక్టర్, ఏ హీరో హెబ్బా కెరీర్‌ను దారిలో పెడతారో చూడాలి.