Raashi Khanna: బాలీవుడ్ వైపు అడుగులేస్తున్న రాశీఖన్నా .. లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్
తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. చూడచక్కని రూపం.. ఆకట్టుకునే అభినయంతో ప్రేక్షకులను అలరించింది. ఆతర్వాత రాశీఖన్నాకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. తక్కువ సమయంలోనే రాశిఖన్నా మంచి ఆఫర్స్ ను అందుకుంది. తెలుగులో దాదాపు యంగ్ హీరోలందరితో కలిసి నటించింది ఈ చిన్నది. అయితే రాశిఖన్నా కు పెద్ద హీరోల సినిమాల్లో చన్స్లు మాత్రం రావడంలేదు. కేవలం యంగ్ హీరోల సినిమాల్లోనే ఈ చిన్నది ఆఫర్స్ అందుకుంటుంది.

టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది ముద్దుగుమ్మ రాశిఖన్నా.. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ భామ. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. చూడచక్కని రూపం.. ఆకట్టుకునే అభినయంతో ప్రేక్షకులను అలరించింది. ఆతర్వాత రాశీఖన్నాకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. తక్కువ సమయంలోనే రాశిఖన్నా మంచి ఆఫర్స్ ను అందుకుంది. తెలుగులో దాదాపు యంగ్ హీరోలందరితో కలిసి నటించింది ఈ చిన్నది. అయితే రాశిఖన్నా కు పెద్ద హీరోల సినిమాల్లో చన్స్లు మాత్రం రావడంలేదు. కేవలం యంగ్ హీరోల సినిమాల్లోనే ఈ చిన్నది ఆఫర్స్ అందుకుంటుంది. అయితే సినిమాలు హిట్ అయినప్పటికీ ఆ క్రెడిట్ ఈ అమ్మడి ఖాతాలోకి రావడం లేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగులేస్తోంది.
టాలీవుడ్ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ బాలీవుడ్ కు వెళ్లిన విషయం తెలిసిందే. హిందీలో హీరోయిన్స్ గా చేసి ఆతర్వాత కనిపించకుండా పోయారు కూడా కొందరు. మరికొంతమంది అక్కడ అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలో రకుల్ ప్రీత్ సింగ్, రష్మిక, పూజాహెగ్డే లాంటి హీరోయిన్స్ హిందీలో బిజీ కావాలని చూస్తున్నారు. వెరీ రీసెట్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా జవాన్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు.
View this post on Instagram
అలాగే ఇప్పుడు రాశి ఖన్నా కూడా బాలీవుడ్ వైపు అడుగులేస్తోంది. మొనీమద్యే ఓ వెబ్ సిరీస్ లో నటించింది కూడా.. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా నటిస్తున్న యోదా సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాలో దిశాపటాని కూడా నటిస్తుంది. అలాగే ఓ లవ్ స్టోరీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.
View this post on Instagram
అలాగే ఈ సినిమాలో రొమాంటిక్స్ సీన్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. బాలీవుడ్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా.. రాశిఖన్నా కూడా గ్లామర్ షోకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తుంది. చూడాలి మరి ఈ భామ బాలీవుడ్ లో ఏ మేరకు సక్సెస్ అవుతుందో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
