Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna Birthday: హ్యాపీ బర్త్ డే కింగ్.. టాలీవుడ్‏లో నాగార్జునకు మాత్రమే ఈ రికార్డ్స్ సాధ్యం..

దాదాపు మూడు దశాబ్దాలుగా సినీరంగంలో స్టార్ హీరోగా అలరిస్తున్నారున నాగ్. క్లాస్, మాస్ హీరోగా మెప్పిస్తూనే.. ఇటు భక్తిగీతాలు ఆలపించడం ఆయనకే సాధ్యం. 37 ఏళ్ల నట ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్న నాగ్.. ఎన్నో వైవిధ్య పాత్రలతో వెండితెరపై ప్రేక్షకులను అలరించారు నాగార్జున. అమ్మాయిల కలల రాకుమారుడిగా క్లాస్ చిత్రాలతో సందడి చేసిన నాగ్... రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో శివ సినిమాతో మాస్ హీరోగానూ రచ్చ చేశారు.

Nagarjuna Birthday: హ్యాపీ బర్త్ డే కింగ్.. టాలీవుడ్‏లో నాగార్జునకు మాత్రమే ఈ రికార్డ్స్ సాధ్యం..
Akkineni Nagarjuna
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 29, 2023 | 8:10 AM

టాలీవుడ్ నవ మన్మథుడు కింగ్ నాగార్జున. అక్కినేని నాగేశ్వర రావు తనయుడిగా విక్రమ్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ప్రేమకథా చిత్రాలకు నాగ్ కేరాఫ్ అడ్రస్. అలాగే ఇటు భక్తిరస చిత్రాలు అంటే సీనియర్ ఎన్టీఆర్ తర్వాత గుర్తొచ్చే పేరు నాగార్జున. ఈరోజు టాలీవుడ్ కింగ్ పుట్టిన రోజు. దాదాపు మూడు దశాబ్దాలుగా సినీరంగంలో స్టార్ హీరోగా అలరిస్తున్నారున నాగ్. క్లాస్, మాస్ హీరోగా మెప్పిస్తూనే.. ఇటు భక్తిగీతాలు ఆలపించడం ఆయనకే సాధ్యం. 37 ఏళ్ల నట ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్న నాగ్.. ఎన్నో వైవిధ్య పాత్రలతో వెండితెరపై ప్రేక్షకులను అలరించారు నాగార్జున. అమ్మాయిల కలల రాకుమారుడిగా క్లాస్ చిత్రాలతో సందడి చేసిన నాగ్… రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో శివ సినిమాతో మాస్ హీరోగానూ రచ్చ చేశారు. అలాగే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో అన్నమయ్యగా.. శ్రీరామదాసుగా మెప్పించి ప్రశంసలు అందుకున్నారు.

నాగార్జున మొదటి చిత్రం విక్రమ్.. 1986 మే 23న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. నాగ్ కెరీర్‏లో ఆఖరి పోరాటం, గీతాంజలి, శివ, నిన్నే పెళ్లాడతా, హలో బ్రదర్ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా ఆర్జీవి దర్శకత్వంలో నాగ్ నటించిన శివ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇందులో నాగ్ మాస్ హీరోగా కనిపించి తనను విమర్శించినవారికితానేంటో నిరూపించారు. ఆ తర్వాత కృష్ణ వంశీ దర్శకత్వంలో విడుదలైన నిన్నే పెళ్లాడతా సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి ఏకంగా 9 నంది అవార్డ్స్, మూడు ఫిలింఫేర్ అవార్డ్స్, రెండు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అందుకున్నారు. 1997లో వచ్చిన అన్నమయ్య సినిమాతో ఒక్కసారిగా విమర్శకుల  నుంచి పొగడ్తలు వచ్చేలా చేసుకున్నారు నాగ్.

ఇవి కూడా చదవండి

శివ, మాస్, క్రిమినల్ చిత్రాలతో కేవలం దక్షిణాదిలోనే కాకుండా నార్త్‏లోనూ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు నాగ్. ఈ సినిమాలతో ఆయనకు హిందీలో గుర్తింపు వచ్చింది. నాగార్జునకు యువతలో మంచి క్రేజ్ తీసుకువచ్చిన సినిమా గీతాంజలి. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో వండర్ క్రియేట్ చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.