AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman Collections: ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన ‘హనుమాన్’.. కలెక్షన్ల విధ్వంసం..

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇతిహాసాల్లోని సూపర్ హీరో హనుమాన్ పాత్రను స్పూర్తిగా తీసుకుని రూపొందించిన ఈ మూవీలో యంగ్ హీరో తేజా సజ్జా హీరోగా నటించాడు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలకపాత్రలు పోషించారు. సినీ రాజకీయ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది ఈ మూవీ. హనుమాన్ చిత్రం అద్భుతంగా ఉందంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు.

Hanuman Collections: ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన 'హనుమాన్'.. కలెక్షన్ల విధ్వంసం..
Hanuman Movie
Rajitha Chanti
|

Updated on: Jan 30, 2024 | 3:48 PM

Share

ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో వసూళ్ల సునామి సృష్టిస్తోంది ‘హనుమాన్’. చిన్న సినిమాగా సంక్రాంతి పండక్కి విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్‏తో దూసుకుపోతుంది. ఒకే సారి మూడు సినిమాలు పోటీకి వస్తున్నా.. తమ కంటెంట్ పై నమ్మకంతో బరిలోకి దిగి భారీ విజయాన్ని సాధించారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇతిహాసాల్లోని సూపర్ హీరో హనుమాన్ పాత్రను స్పూర్తిగా తీసుకుని రూపొందించిన ఈ మూవీలో యంగ్ హీరో తేజా సజ్జా హీరోగా నటించాడు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలకపాత్రలు పోషించారు. సినీ రాజకీయ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది ఈ మూవీ. హనుమాన్ చిత్రం అద్భుతంగా ఉందంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ. 265 కోట్లు వసూళ్లు రాబట్టింది. సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలకు టార్గెట్ సెట్ చేసింది.

ఇప్పుడు ఈ సినిమా రూ. 300 కోట్ల దిశగా పరుగులు పెడుతుంది. పాన్ ఇండియా స్థాయిలో హనుమాన్ మ్యానియా కొనసాగుతుంది. అటు అమెరికాలోనూ ఈ సినిమా సత్తా చాటుతుంది. ఇప్పటికే నాలుగు మిలియన్ డాలర్స్ వసూళ్లు రాబట్టింది. ఓవైపు థియేటర్లలో ఈ మూవీ క్రేజ్ తగ్గనేలేదు.. అప్పుడే సీక్వెల్ పార్ట్ స్టార్ట్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. త్వరలోనే సీక్వెల్ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో కనిపించనున్నారని అంటున్నారు. ప్రస్తుతం హనుమాన్ 2 ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే.. అటు హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ పై ఓ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని త్వరలోనే డిజిటల్ ప్లాట్ ఫాంపైకి తీసుకురావాలనుకుంటున్నారట. థియేటర్లలో హనుమాన్ ఫీవర్ తగ్గకముందే ఈచిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనుకుంటున్నారట. అయితే తాజా సమాచారాం ప్రకారం ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను జీ5 కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది ఫిబ్రవరి రెండో వారంలో స్ట్రీమింగ్ కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.