Prasanth Varma: ‘హనుమాన్’ దర్శకుడి వద్ద ఫుల్ టైమ్ జాబ్స్.. దరఖాస్తు చేసుకోండిలా..
హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిపోయాడు ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సూపర్ హీరో కాన్సెప్ట్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం 40 కోట్లతో నిర్మించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 400 కోట్ల వరకు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ సినిమాతో హీరో, డైరెక్లర్లకు బాగా డిమాండ్ ఏర్పడింది. ఇక డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా ‘జై హనుమాన్’ ను తెరకెక్కిస్తున్నాడు

హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిపోయాడు ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సూపర్ హీరో కాన్సెప్ట్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం 40 కోట్లతో నిర్మించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 400 కోట్ల వరకు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ సినిమాతో హీరో, డైరెక్లర్లకు బాగా డిమాండ్ ఏర్పడింది. ఇక డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా ‘జై హనుమాన్’ ను తెరకెక్కిస్తున్నాడు. పెద్ద పెద్ద నిర్మాతలు కూడా ప్రశాంత్ తో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ తన వద్ద ఒక ఉద్యోగం ఉందని ప్రకటించాడు. ‘మేము పోస్టర్ డిజైనర్స్ కోసం చూస్తున్నాం. ఇది ఫుల్ టైమ్ జాబ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు talent@thepvcu.com ద్వారా మమ్మల్ని సంప్రదించండి” అంటూ ట్విట్టర్ ద్వారా జాబ్ ఆఫర్ చేశాడు. ఇక ప్రశాంత్ వర్మ ప్రకటనకు భారీగా రెస్పాన్స్ వస్తోంది. అర్హతల వివరాలు కూడా తెలపాలంటూ రీ ట్వీట్లు చేస్తున్నారు. మరి సినిమా ఇండస్డ్రీలో వెళ్లాలని ఆసక్తికలిగిన వారు, ప్రశాంత్ వర్మతో కలిసి పనిచేయాలని ఉన్నవారు ఈ సదావకాశాన్ని వదులుకోకండి. అర్హులు అయిన వారు వెంటనే దరఖాస్తు చేయండి.
హనుమాన్ సినిమా తర్వాత జై హనుమాన్ సీక్వెల్ ను పట్టాలెక్కించాడు ప్రశాంత్ వర్మ . అయితే మధ్యలో రణ్ వీర్ సింగ్ తో రాక్షస్ అనే సినిమాను కూడా అనౌన్స్ చేశాడు. కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారని టాక్ నడిచింది. అయితే ఉన్నట్లుండి ఈ ప్రాజెక్టు వాయిదా పడింది. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమా ఆగిపోయిందని మేకర్స్ ప్రకటించారు. అయితే భవిష్యత్ లో తప్పకుండా ప్రశాంత్ వర్మ- రణ్ వీర్ సింగ్ సినిమా ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సీక్వెల్ తో పాటు ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
ప్రశాంత్ వర్మ ట్వీట్..
Looking for poster designers. Full time job. Please reach out.. talent@thepvcu.com
— Prasanth Varma (@PrasanthVarma) June 6, 2024
Extremely grateful to everyone for your wonderful wishes and blessings! 🫶🏻🙏🏻
Excited to announce the Bridge between You & Me by launching the Website “ https://t.co/gOIwP2aRTs ” making this day more special for all of us! 🤗
Stay connected for #ThePVCU first hand updates at… pic.twitter.com/a4IWXwqBEy
— Prasanth Varma (@PrasanthVarma) May 29, 2024
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




