AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: అందమైన ప్రేమకథ.. సాయి పల్లవితో విజయ్ దేవరకొండ రొమాన్స్.!

గీతగోవిందం సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోతున్నాడు విజయ్. లైగర్ సినిమా డిజాస్టర్ అవ్వడం ఆతర్వాత వచ్చిన ఖుషి సినిమా కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపించకపోవడం తో విజయ్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయినా ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపాయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నిరాశపరిచింది. దాంతో విజయ్ ఫ్యాన్ ఆయన నుంచి ఓ భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.

Sai Pallavi: అందమైన ప్రేమకథ.. సాయి పల్లవితో విజయ్ దేవరకొండ రొమాన్స్.!
Vijay Devarakonda, Sai Pall
Rajeev Rayala
|

Updated on: Jun 07, 2024 | 10:55 AM

Share

రౌడీ హీరో విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ మధ్యకాలంలో విజయ్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. గీతగోవిందం సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోతున్నాడు విజయ్. లైగర్ సినిమా డిజాస్టర్ అవ్వడం ఆతర్వాత వచ్చిన ఖుషి సినిమా కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపించకపోవడం తో విజయ్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయినా ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపాయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నిరాశపరిచింది. దాంతో విజయ్ ఫ్యాన్ ఆయన నుంచి ఓ భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు విజయ్ వరుసగా సినిమాలను లైనప్ చేశారు. ఇటీవలే విజయ్ పుట్టిన రోజున ఏకంగా మూడు సినిమాలను  అనౌన్స్ చేశారు.

ఇక ఇప్పుడు విజయ్ సాయి పల్లవి కలిసి ఓ సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. విజయ్ లైనప్ చేసిన సినిమాల్లో రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్న సినిమా ఒకటి. ఈ సినిమా ఓ అందమైన ప్రేమకథతో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ కు జోడీగా సాయి పల్లవి నటిస్తుందని ఫిలిం సర్కిల్స్ లో న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా కాంబో కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. సాయి పల్లవి నేచురల్ బ్యూటీగా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

విజయ్ కు ఉన్న ఫ్యాన్ బేస్ తో పాటు సాయి పల్లవి క్రేజ్ కూడా తోడైతే ఆ సినిమా పక్కా హిట్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఫిదా సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సాయి పల్లవి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారింది. తెలుగులో యంగ్ హీరోలందరి సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం సాయి పల్లవి తండేల్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా తర్వాత విజయ్ తో సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందో చూడాలి.

సాయి పల్లవి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

విజయ్ దేవరకొండ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి
8 ఫోర్లు, 8 సిక్స్‌లు.. 62 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిన రోహిత్
8 ఫోర్లు, 8 సిక్స్‌లు.. 62 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిన రోహిత్
మీ సెల్‌ఫోన్ పోయిందా.. అయితే ఇలా చేయండి.!
మీ సెల్‌ఫోన్ పోయిందా.. అయితే ఇలా చేయండి.!
సీనియర్ హీరోయిన్ నిరోషా గుర్తుందా.. ?
సీనియర్ హీరోయిన్ నిరోషా గుర్తుందా.. ?
నిరుద్యోగులకు అలర్ట్.. రైల్వేలో 22,000 గ్రూప్‌ డి ఉద్యోగాలు
నిరుద్యోగులకు అలర్ట్.. రైల్వేలో 22,000 గ్రూప్‌ డి ఉద్యోగాలు
సాఫ్ట్‌వేర్ గర్ల్ ఫ్రెండ్.. బద్మాష్ బాయ్ ఫ్రెండ్.. ఇద్దరు కలిసి
సాఫ్ట్‌వేర్ గర్ల్ ఫ్రెండ్.. బద్మాష్ బాయ్ ఫ్రెండ్.. ఇద్దరు కలిసి
బీపీ ఒకేసారి ఎక్కువైతే ఏం చేయాలి..? వెంటనే ఇలా చేస్తే తగ్గుతుంది!
బీపీ ఒకేసారి ఎక్కువైతే ఏం చేయాలి..? వెంటనే ఇలా చేస్తే తగ్గుతుంది!
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి దారిలో ఏదో వస్తువు కనిపించింది..
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి దారిలో ఏదో వస్తువు కనిపించింది..
ఆఖరికి సావే సచ్చిపోయింది.. రష్మిక మైసా గ్లింప్స్ రిలీజ్..
ఆఖరికి సావే సచ్చిపోయింది.. రష్మిక మైసా గ్లింప్స్ రిలీజ్..
కలబందతో కాస్త భద్రంగానే ఉండాలి.. లేదంటే, కథ అడ్డం తిరిగినట్టే..!
కలబందతో కాస్త భద్రంగానే ఉండాలి.. లేదంటే, కథ అడ్డం తిరిగినట్టే..!