Gundu Kalyanam: దాదాపు 750 సినిమాల్లో నటించిన హాస్య నటుడు.. నేడు ఆర్ధిక ఇబ్బందులతో చికిత్స కోసం ఎదురుచూపులు
Gundu Kalyanam: ప్రముఖ హాస్య నటుడు ఏఐఏడీఎంకే నేత గుండు కళ్యాణం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న...
Gundu Kalyanam: ప్రముఖ హాస్య నటుడు ఏఐఏడీఎంకే నేత గుండు కళ్యాణం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న గుండు కళ్యాణం ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. డయాలసిస్ చేయించుకున్న కళ్యాణం.. ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. తనను ఎవరైనా ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నాడు.
గుండు కళ్యాణ్ హాస్యనటుడిగానే కాదు.. అన్నాడీఎంకే వీరాభిమానికూడా.. దివంగత నటులు ఎంజీఆర్, జయలలితలపై ఉన్న అభిమానంతో అన్నాడీఎంకే చేరారు. ఆ పార్టీ కోసం … పనిచేశారు. గుండు కళ్యాణ్ ఆరోగ్యం పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత వద్ద సహాయకుడిగా పనిచేసిన పూంగుడ్రన్ తన ఫేస్‌బుక్ ఖాతాలో ట్విట్ చేశారు. ప్రస్తుతం గుండు కళ్యాణ్ పరిస్థితి బాగోలేదని.. రోజుకు రెండుసార్లు డయాలసిస్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఆయనకు వైద్యం చేయించుకునే స్థితిలేదని.. తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారని పూంగుడ్రన్ చెప్పారు. అమ్మ జీవించి ఉంటే.. గుండు కళ్యాణ్ చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం భరించేవారని.. అయితే ఇప్పుడు ఆ పరిస్థితిలేదని చెప్పారు. కనుక ఇప్పుడు గుండు కళ్యాణ్ కు అన్నాడీఎంకె కార్యకర్తలు అండగా నిలబడాల్సిన సమయం వచ్చిందని.. తమకు తోచినంత ఆర్ధిక సాయం అందించాలని కోరారు.
1967 సంవత్సరంలో సినీ రంగంలోకి ప్రవేశించిన గుండు కళ్యాణం అసలు పేరు లక్ష్మీ నారాయణన్. వెండి తెరపై 1979లో మజలై పట్టాళం సినిమాతో కోలీవుడ్ లో అడుగు పెట్టాడు. హాస్య నటుడుగా వివిధ భాషల్లో 750 పైగా సినిమాల్లో నటించాడు. ముఖ్యంగా అప్పట్లో రజనీకాంత్ సినిమాల్లో గుండు కళ్యాణ్ కు స్పెషల్ పాత్ర ఉండేది.. దీంతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం. గుండు కళ్యాణ్ మంచి హాస్య నటుడు మాత్రమే కాదు.. నంగ పడుసా, నల్ల నల్ల పిల్లైగలై నంబి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అతను నల్ల నల్ల పిల్లైగళై నంబి సినిమా కోసం దేశభక్తి గీతాన్ని రచించాడు మరియు ఆ పాటను మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు.
Also Read: ‘జూ’లో కరోనా వైరస్ కల్లోలం.. ఏడు పక్షులు, సింహం ఆకస్మికంగా మృతి.. ఎక్కడంటే..