బుర్ర మీసాల ఈ బుడతడు ఎవరో గుర్తుపట్టారా.? రీసెంట్‌గానే బ్లాక్ బస్టర్ కొట్టాడు..
సినిమా హీరోలు, హీరోయిన్స్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. సందర్భం ఏదైనా సరే సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోలు దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు సోషల్ మీడియాలోతెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ యంగ్ హీరో చైల్డ్ హుడ్ ఫోటో నెట్టింట షికారు చేస్తుంది.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో విషయాలు మనకు చిటికెలో తెలిసిపోతున్నాయి. ప్రపంచం నలుమూలల ఎక్కడ ఏం జరిగినా కూడా అది క్షణాల్లో మన ఫోన్ లో ప్రత్యక్షం అవుతుంది. సెలబ్రెటీలు కూడా సినిమాలతో కంటే సోషల్ మీడియాతోనే అభిమానులతో ఎక్కువుగా టచ్ లో ఉంటున్నారు. ఇక నెటిజన్స్ తమ అభిమాన హీరో, హీరోయిన్స్ ఫోటోలను వీడియోల్ను పంచుకుంటూ తెగ హడావిడి చేస్తుంటారు. ఒకొక్క హీరో, హీరోయిన్ పేరు మీద వందలాది సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి. ఇక సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోలు కూడా తరచూ సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ స్టార్ హీరో చైల్డ్ హుడ్ ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇంతకూ ఆ ఫొటోలో ఉన్న బుడతడిని గుర్తుపట్టారా.? ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ఆ కుర్రాడు.
ఇండస్ట్రీలోకి ఎంతో మంది స్టార్ కిడ్స్ వచ్చారు. తమ ప్రతిభతో కొంతమంది సక్సెస్ అయ్యారు కూడా అలాంటి వారిలో పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నోడు ఒకరు. పై ఫొటోలో పెద్ద పెద్ద మీసాలతో, తలపై కిరీటం, ఒంటినిండ నగలు దిగేసుకున్న ఆ బుడతడు ఎవరో కాదు.. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లం కొండ సాయి శ్రీనివాస్. ఈ యంగ్ హీరో అల్లుడు శీను సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నటన పరంగానూ బెల్లం కొండ శ్రీనివాస్ మెప్పించాడు. కానీ ఆతర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ నిరాశపరిచాయి.
ఆ మధ్య బాలీవుడ్ లోనూ అదృష్టం పరీక్షించుకున్నాడు. తెలుగులో రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేశాడు. కానీ ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఇటీవలే భైరవం సినిమాతో పేక్షకుల ముందుకు వచ్చాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మంచు మనోజ్, నారా రోహిత్ కూడా నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాదు ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇటీవలే మదర్స్ డే సందర్భంగా పై ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




