Tollywood: తలకిందులుగా యోగాసనమేసిన తెలుగు హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా? పవన్‌తో యాక్ట్ చేసిందండోయ్

ప్రపంచ యోగా దినోత్సవం (జూన్ 21) సందర్భంగా శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో మొదలు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖుల వరకు యోగాసనాలు వేశారు. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరీ ముఖ్యంగా పలువురు సినీ ప్రముఖులు యోగాసనాలు వేసి వాటి ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు

Tollywood: తలకిందులుగా యోగాసనమేసిన తెలుగు హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా? పవన్‌తో యాక్ట్ చేసిందండోయ్
Tollywood Actress
Follow us

|

Updated on: Jun 22, 2024 | 8:18 AM

ప్రపంచ యోగా దినోత్సవం (జూన్ 21) సందర్భంగా శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో మొదలు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖుల వరకు యోగాసనాలు వేశారు. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరీ ముఖ్యంగా పలువురు సినీ ప్రముఖులు యోగాసనాలు వేసి వాటి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అలా ఓ తెలుగు హీరోయిన్ షేర్ చేసిన ఒక ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూడటానికి చాలా సింపుల్‌గా కనిపిస్తుంది. అయితే ట్రై చేస్తేనే అసలు కష్టం తెలుస్తుంది. ఇందులో ఆమె చేతుల మీద తలకిందులుగా నిల్చొవడంతో పాటు శీర్షాసనం కూడా వేసింది. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. అది కాస్తా ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారింది. మరి ఇంతకీ ఆ తెలుగు హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? ఇంతకీ ఈ ఫిట్ నెస్ ఫ్రీక్ మరెవరో కాదు మన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇప్ఉడు రీల్స్, ఫొటో షూట్స్ అంటూ తన ఫాలోవర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇలా శీర్షాసనమేసింది. అంతేకాదు వీటిని నెట్టింట షేర్ చేసి తన అభిమానులు, నెటిజన్లను యోగాసనాలు చేసేలా మోటివేట్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికి వస్తే.. మల్లేశం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అనన్య నాగళ్ల. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో ఒక కీలక పాత్ర పోషించింది. నితిన్ మ్యాస్ట్రో, ఊర్వశివో రాక్షసివో, శాకుంతలం, మళ్లీ పెళ్లి, అన్వేషి సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఇటీవలే తంత్ర సినిమాతో ఒక మంచి సాలిడ్ హిట్టును తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పొట్టేలు అనే ఓ ఇంట్రెస్టింగ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది అనన్య నాగళ్ల. దీంతో పాటు మరికొన్ని సినిమాలకు పచ్చజెండా ఊపిందీ అందాల తార.

యోగసనాలు చేస్తోన్న అనన్య నాగళ్ల.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles