Guppedantha Manasu Stars: మా అమ్మ చెల్లిని తిడతారా..? ముదిరిన టీవీ హీరోల ఫ్యాన్స్ వార్.. రిషి అభిమానులకు మను వార్నింగ్..
మొదట్లో చిన్నగా మొదలైన ఈ గొడవ ఇప్పుడు తారాస్థాయికి చేరింది. సీరియల్ వరకు ఉండాల్సిన గొడవ ఇప్పుడు వ్యక్తిగతంగా మారినట్లు తెలుస్తోంది. మను అలియాస్ రవిశంకర్ ను.. అతడి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ రిషి ఫ్యాన్స్ దారుణంగా బూతులు తిడుతున్నారట. ఈవిషయాన్ని మను ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.
సాధారణంగా సినీ స్టార్స్ కు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. తమ అభిమాన హీరో కోసం ఏం చేసేందుకైనా రెడీ అయిపోతుంటారు కొందరు ఫ్యాన్స్. తమ హీరో బర్త్ డే రోజు రక్తదానం, అన్నదానం చేయడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ఫ్యాన్స్ వార్ ఎక్కువగా కనిపిస్తుంది. అభిమానం కంటే ఎక్కువగా ట్రోల్స్, నెగిటివ్ కామెంట్లతో ఒకరి హీరోపై మరొక హీరో ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఓ రేంజ్ లో కామెంట్స్ చేసుకుంటారు. ఇప్పటివరకు సినీ స్టార్ హీరోల ఫ్యాన్స్ మాత్రమే చూసుంటారు. కానీ ఇప్పుడు బుల్లితెరపై ఫ్యాన్స్ వార్ మొదలైంది. కొన్నిరోజులుగా గుప్పెడంత మనసు సీరియల్ హీరోల మధ్య ఫ్యాన్స్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే గొడవ తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. గుప్పెడంత మనసు సీరియల్లో మను పాత్రను పోషిస్తున్న డాక్టర్ కమ్ నటుడు రవి శంకర్ రాథోడ్ పై రిషి అలియాస్ ముఖేష్ గౌడ అభిమానులు విరుచుకుపడ్డారు.
మొదటి నుంచి మనుపై రిషి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే. మను పాత్రను పోషిస్తున్న రవిశంకర్ టార్గెట్గా నెగిటివ్ పోస్టులు పెట్టారు. రిషిని తప్పించి మనును సీరియల్లోకి తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రిషి ఫ్యాన్స్. మొదట్లో చిన్నగా మొదలైన ఈ గొడవ ఇప్పుడు తారాస్థాయికి చేరింది. సీరియల్ వరకు ఉండాల్సిన గొడవ ఇప్పుడు వ్యక్తిగతంగా మారినట్లు తెలుస్తోంది. మను అలియాస్ రవిశంకర్ ను.. అతడి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ రిషి ఫ్యాన్స్ దారుణంగా బూతులు తిడుతున్నారట. ఈవిషయాన్ని మను ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. “గుప్పెడంత మనసు సీరియల్లో రిషి పాత్రలో నటించే ముఖేష్ గౌడకు ఆరోగ్యం బాలేదు. దీంతో ఆ కథకు ఒక హీరో అవసరం. అందుకే నన్ను తీసుకున్నారు. హీరో లేకుండా కథను చేయలేరు. నాకు ఇచ్చిన పాత్రను నేను పోషించాను. కానీ నన్ను బూతులు తిడుతున్నారు. అమ్మను, అక్కను, చెల్లిని.. ఇలా అందరిని టార్గెట్ చేస్తూ బూతులు తిడుతున్నారు.
ఆ బూతులు తిట్టేవాడు.. బూతు పోస్టులు పెట్టేవాడి ప్రొఫైల్ చూస్తే జీరో ఫాలోవర్స్.. జీరో పోస్టులు. బయటకు వచ్చి మాట్లాడరా అంటే మాట్లాడలేడు. లైవ్ లోకి వస్తా.. రా మాట్లాడు.. నీ సామర్థ్యం ఏంటో నా సామర్థ్యం ఏంటో తేలిపోద్ది. రా తేల్చుకుందాం. నేను ఊరికే రాలేదు. నేను ఈరోజు సీరియల్స్ మానేసినా కూడా నన్ను ఇంట్లో బ్రహ్మండంగా చూసుకుంటారు. మా ఇంట్లో పది మంది డాక్టర్స్ ఉన్నారు. యాక్టింగ్ అంటే ఫ్యాషన్ నాకు అందుకే చేస్తున్నాను. నేను ఏం చేయను ఇంట్లో ఉంటాను అంటే ఏ లోటు లేకుండా చూసుకుంటారు మా నాన్న. నా మీద కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంది. మాకు గుడి ఉంది. దానికి ధర్మకర్తలుగా ఉన్నాం. మేము సంపాదించింది దానం చేస్తున్నాం. అడుక్కోవడంలేదు. తిరుపతి రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ మెంబర్ ను నేను. ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ ఆటో స్టాండ్ నిర్మించారు మా నాన్న. అందుకే నన్ను ఆ యూనియన్ మెంబర్ ను చేశారు. నన్ను తిడుతున్నట్లు వాళ్లకు చెపితే వాయించిపడేస్తారు. నేను తిట్టగలను.. అలా చేస్తే మీకు వాళ్లకు తేడా ఏముంటుంది. ఇలా పర్సనల్ అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు మను.