AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తీసింది కేవలం 5 సినిమాలే.. 2 నేషనల్ అవార్డులు.. ఈ టాలీవుడ్ సెన్సేషన్ ఎవరో గుర్తు పట్టారా?

2014లో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అంటే దాదాపు 12 సంవత్సరాలు. ఇప్పటివరకు అన్నీ కలిపి కేవలం ఐదు సినిమాలు మాత్రమే చేశాడు. కానీ తన ట్యాలెంట్ తో ఏకంగా రెండు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇతని పేరు తెగ మార్మోగుతుంది.

Tollywood: తీసింది కేవలం 5 సినిమాలే.. 2 నేషనల్ అవార్డులు.. ఈ టాలీవుడ్ సెన్సేషన్ ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Director
Basha Shek
|

Updated on: Jul 30, 2026 | 7:43 PM

Share

పై ఫొటోలో కనిపిస్తున్న కుర్రాడిని గుర్తు పట్టారా? ఇప్పుడితను తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా పాపులర్. అలాగనీ ఇతను పదులు, వందల సంఖ్యలో సినిమాలు తీయలేదు. అప్పుడెప్పుడో 2014లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఈ 12 ఏళ్ల కాలంలో కేవలం ఐదు సినిమాలు మాత్రమే చేశాడు. మొదట్లో తన సినిమాల్లో ఎక్కువగా కామెడీకే ప్రాధాన్యం ఇచ్చాడితను. కానీ ఆ తర్వాత ఎమోషన్స్ కు పెద్ద పీట వేశాడు. కట్ చేస్తే.. మొదటి రెండు సినిమాలు యావరేజ్ గా ఆడితే.. తర్వాతి రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఒక సినిమా అయితే థియేటర్ల లో రిలీజ్ కు సమస్యలు రావడంతో డైరెక్టుగా ఓటీటీలోకి రిలీజ్ చేశాడు. అయితేనేం సినిమా సెన్సేషనల్ హిట్. విమర్శకుల ప్రశంసలతో పాటు ఏకంగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. దీని తర్వాత మరో ట్రయాంగిల్ లవ్ స్టోరీ తీశాడు. ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అయ్యింది. సినిమా చూసిన ఆడియెన్స్ అందరూ కన్నీళ్లు పెట్టుకుంటూ బయటకు వచ్చారు. ముఖ్యంగా యూత్ అయితే ఈ సినిమా చూసి పిచ్చెక్కి పోయారు. దీనికి అదనంగా మరో జాతీయ అవార్డు ఖాతాలో వచ్చింది.ఇక ఇటీవలే మరో సినిమాతో ముందు కొచ్చాడీ టాలీవుడ్ సంచలనం. మళ్లీ సేమ్ టు సేమ్. ఎమోషన్స్‌ తో ఆడియెన్స్ ను కన్నీళ్లు పెట్టించాడు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇతని పేరు మార్మోగుతోంది. అలాగనీ ఇతను స్టార్ హీరో ఏమీ కాదు.

పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు.. రైటర్ గా, నిర్మాతగా, డైరెక్టర్ గా సత్తా చాటుతోన్న సాయి రాజేష్. కలర్ ఫొటో, బేబీ సినిమాలకు గానూ రెండు జాతీయ అవార్డులు అందుకున్న ఇతను ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహించకపోయినా కథ, స్క్రీన్ ప్లే అందించాడు. అలాగే నిర్మాతగానూ వ్యవహరించాడు. జులై 23న రిలీజైన చెన్నై లవ్ స్టోరీ సినిమా సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లు రాబడుతోంది.

ఇవి కూడా చదవండి

చెన్నై లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్లలో సాయి రాజేష్..

కాగా కెరీర్ ప్రారంభంలో సంపూర్ణేశ్ బాబుని హీరోగా పెట్టి ‘హృదయ కాలేయం’ సినిమా తీశాడు సాయి రాజేష్. ఈ సినిమాకు కథ అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. ఆ తర్వాత మరోసారి సంపూర్ణేశ్ బాబుతోనే మళ్లీ ‘కొబ్బరిమట్ట’ అనే సినిమా తీశాడు. ఆ తర్వాత ‘కలర్ ఫొటో’ సినిమాకు స్టోరీ అందించడంతో నిర్మాతగానూ వ్యవహరించాడు. ఈ మూడు సినిమాలకు కథ అందించిన సాయి రాజేష్ బేబీ సినిమాతో మెగా ఫోన్ అందుకున్నాడు. డైరెక్టర్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అంతకు ముందు కలర్ ఫొటో సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న ఇతను బేబీ సినిమాకు బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా మరోసారి నేషనల్ అవార్డ్ సొంత చేసుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us