AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఏందీ మావా ఇదీ.. అప్పుడు సైడ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. స్టార్ హీరోలకు మించిన క్రేజ్..

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్. విభిన్నమైన చిత్రాలు.. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. అద్భుతమైన నటనతో దక్షిణాది సినీప్రియుల హృదయాలను గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ. కానీ ఒకప్పుడు సినిమాల్లో సైడ్ ఆర్టిస్టుగా కనిపించింది. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరలవుతుంది.

Tollywood : ఏందీ మావా ఇదీ.. అప్పుడు సైడ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. స్టార్ హీరోలకు మించిన క్రేజ్..
Sai Pallavi
Rajitha Chanti
|

Updated on: May 30, 2025 | 12:37 PM

Share

సౌత్ ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించి నటిగా ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. కానీ మీకు తెలుసా.. కెరీర్ తొలినాళ్లల్లో ఆమె సైడ్ ఆర్టిస్టుగా కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు ఆమె తెలుగు చిత్రపరిశ్రమలో తోపు హీరోయిన్. గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉంటూ సహజ నటనతోనే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదండి.. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి. పైన కనిపిస్తున్న ఫోటో కస్తూరిమాన్ సినిమాలోనిది.

2003లో విడుదలైన కస్తూరిమాన్ సినిమాకు లోహిదాస్ దర్శకత్వం వహించారు. ఇందులో మీరా జాస్మిన్, కుంచాకో బోబన్ హీరోహీరోయిన్లుగా నటించారు. మలయాళంలో ఆల్-టైమ్ సూపర్ హిట్లలో కస్తూరిమాన్ ఒకటి. తరువాత, ఈ చిత్రాన్ని లోహిత దాస్ అదే పేరుతో తమిళంలో కూడా నిర్మించారు. ఈ సినిమాలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఇందులో సాయి పల్లవి హీరోయిన్ స్నేహితురాలిగా కనిపించింది. ఎ.కె.ముద్ర ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి మీరా జాస్మిన్ నటనకుగానూ ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకుంది. ఈ సినిమాలో సైడ్ ఆర్టిస్టుగా కనిపించిన సాయి పల్లవి.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తుంది.

కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న సాయి పల్లవి.. ఆ తర్వాత అల్ఫోన్స్ పుత్రేంటే నిర్మించిన ప్రేమమ్ సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఫిదా మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాలతో తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ అందుకుంది సాయి పల్లవి. ఇటీవలే తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం హిందీలో రామాయణ చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీకి రూ.10 లక్షలు పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్.

ఇవి కూడా చదవండి :  

OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..

Nagarjuna: టాలీవుడ్‏ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..

Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..