Vijayawada: ఖలేజా రీ రిలీజ్ – థియేటర్‌లోకి పామును తీసుకొచ్చిన మహేశ్ అభిమాని
విజయవాడలో మహశ్ అభిమాని ఓవరాక్షన్ చేశాడు. ఖలేజా సినిమా రీ రిలిజ్ సందర్భంగా ఏకంగా నిజమైన పామును తీసుకొచ్చాడు. తొలుత అది బొమ్మ పాము ఏమో అని మిగిలిన ప్రేక్షకులు భావించారు. కానీ అది తర్వాత చేతిలో కదులుతూ ఉండటంతో నిజమైన పాము అని తెలుసుకుని భయబ్రాంతులకు గురయ్యారు.

Mahesh Fan With Snake
మహేష్‌బాబు ఖలేజా సినిమా రీరిలీజ్ సందర్భంగా అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. విజయవాడలోని ఓ థియేటర్‌లోకి పాము పట్టుకుని వచ్చాడు ఓ అభిమాని. మహేష్‌బాబు ఎంట్రీ సీన్‌లో పాముతో నడిచివచ్చే సన్నివేశాన్ని అనుకరించడం కోసం నిజమైన పాముతో థియేటర్లోకి వచ్చాడు ఆ యువకుడు. మొదట అది బొమ్మ పాము అనుకుని మిగిలిన ప్రేక్షకులు లైట్ తీస్కున్నారు. తర్వాత చేతిలో పాము కదులుతూ ఉండటంతో ప్రేక్షకులు భయభ్రాంతులకు గురయ్యారు. చేతితో పామును పట్టుకుని.. స్క్రీన్ ముందుకెళ్లి ఆ అభిమాని హల్చల్ చేశాడు.
వీడియో దిగువన చూడండి…
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




