Tollywood: గాజుల సవ్వడి చాటున బ్యూటీ నగుమోము.. ఈ అందాల ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టగలరా..?
ఈ మలయాళీ ముద్దుగుమ్మకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఎవరో గుర్తుపట్టండి. మీకోసం మరో క్లూ. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకున్న పొన్నియన్ సెల్వన్ 2 చిత్రంలో ఈ చిన్నది నటించింది. ఇప్పుడు గుర్తుపట్టగలరా ?..
పైన ఫోటోలో ఉన్న అందాల తారను గుర్తుపట్టండి. దక్షిణాది చిత్రపరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలలో ఒకరు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటివరకు ఈ అమ్మడు నటించిన సినిమాలన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ మలయాళీ ముద్దుగుమ్మకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఎవరో గుర్తుపట్టండి. మీకోసం మరో క్లూ. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకున్న పొన్నియన్ సెల్వన్ 2 చిత్రంలో ఈ చిన్నది నటించింది. ఇప్పుడు గుర్తుపట్టగలరా ?.. తనెవరంటే.. మలయాళీ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి. మెడిసిన్ చదివిన ఐశ్వర్య.. జందుకలుండే నత్తిల్ ఒరిదవేల్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మాయనది, వారాంతం వంటి చిత్రాల్లో నటించింది.
కేవలం మలయాళంలోనే కాకుండా తమిళంలోనూ అనేక సినిమాల్లో నటించింది. జగమే తంత్రం చిత్రంలో ధనుష్ సరసన నటించింది. ఈ సినిమాతో ఐశ్వర్యకు గుర్తింపు వచ్చింది. ఇటీవల విడుదలైన సాయి పల్లవి నటించిన గార్గి చిత్రంలోనూ నటించింది ఐశ్వర్య. ఇక ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న పొన్నియన్ సెల్వన్ 2 చిత్రంలో జయంరవి సరసన నటించింది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు అందుతున్నాయి..
గతంలో హీరో సత్యదేవ్ నటించిన గాడ్సే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ అంతగా హిట్ కాకపోవడంతో ఐశ్వర్యకు అంత క్లిక్ అవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన మట్టి కుస్తీ సినిమాతో నటన పరంగాచ ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం తమిళ తెలుగు మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. అటు సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు ఫుల్ యాక్టివ్. లేటేస్ట్ ఫోటోస్ అప్లో్డ్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.