Tollywood: ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో.. అప్ కమింగ్ స్టార్.. ఈ అందాల రాకుమారుడు ఎవరో గుర్తుపట్టండి..
ఇప్పటివరకు ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన మెప్పించిన ఆ యంగ్ హీరో ఇప్పుడు అందమైన ప్రేమకథతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. పైన ఫోటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టండి. మరికొన్ని రోజుల్లో వెండితెరపై సందడి చేయబోతున్నారు.

ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో పాన్ ఇండియా స్టార్స్ హావా నడుస్తోంది. మరోవైపు యంగ్ హీరోస్ సైతం సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కంటెంట్ నచ్చితే.. చిన్నా, పెద్ద హీరోలతో సంబంధం లేకుండా ఆడియన్స్ కూడా థియేటర్లకు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఇండస్ట్రీలో తెలుగు హీరోలకే కాదు.. పరభాష నటుడు కూడా హిట్స్ అందుకుంటూ తమకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే విజయ్ దళపతి.. ధనుష్.. శివ కార్తికేయన్.. సూర్య.. కార్తిలకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే సీతారామం సినిమాతో మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్ సైతం తెలుగు అడియన్స్ ఫేవరేట్ హీరోగా మారారు. ఇక ఇప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు ఓ మలయాళీ హీరో. ఇప్పటివరకు ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన మెప్పించిన ఆ యంగ్ హీరో ఇప్పుడు అందమైన ప్రేమకథతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. పైన ఫోటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టండి. మరికొన్ని రోజుల్లో వెండితెరపై సందడి చేయబోతున్నారు.
ప్రస్తుతం ఆ కుర్రాడు నటించిన సినిమా పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకుంటున్నాయి. ఈ హీరో సరసన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించింది. గుర్తుపట్టారా ?… అతను మరెవరో కాదు.. శాకుంతలం సినిమా హీరో మలయాళీ నటుడు దేవ్ మోహన్. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటిస్తుండగా.. సమంత శకుంతల పాత్రలో కనిపించనుంది. ఈ మూవీ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు దేవ్.




దేవ్ మోహన్.. 1992 సెప్టెంబర్ 18న కేరళలోని త్రిస్సూర్ లో జన్మించారు దేవ్. మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన దేవ్.. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టాడు. 2016లో ముంబై నిర్వహించిన పీటర్ ఇంగ్లండ్ మిస్టర్ ఇండియా 2016లో పాల్గొని ఫైనలిస్ట్ గా నిలిచాడు. 2020లో సూఫియం సుజాతయుమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఆ తర్వాత హోమ్, పంత్రాండు చిత్రాల్లో నటించారు. ఇక ఇప్పుడు శాకుంతలం సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయం కాబోతున్నారు. మరీ ఈ సినిమా తర్వాత తెలుగులో దేవ్ మోహన్ కు మరిన్ని అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




