AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ పిల్లాడిని గుర్తు పట్టారా? యాక్టింగ్‌లో ఆల్‌రౌండర్.. హీరో టు విలన్ ఏదైనా అదరగొట్టేస్తాడంతే!

సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో సత్తా చాటుతోన్న నటీనటుల్లో ఈ అబ్బాయి కూడా ఒకరు. ఒక వైపు హీరోగా చేస్తూనే.. మరో వైపు సహాయక నటుడిగానూ మెప్పిస్తున్నాడు. హీరో టు విలన్ ఏ పాత్రకైనా న్యాయం చేస్తూ యాక్టింగ్ లో ఆల్ రౌండర్ అనిపించుకుంటున్నాడు.

Tollywood: ఈ పిల్లాడిని గుర్తు పట్టారా? యాక్టింగ్‌లో ఆల్‌రౌండర్.. హీరో టు విలన్ ఏదైనా అదరగొట్టేస్తాడంతే!
Tollywood Actor
Basha Shek
|

Updated on: Nov 14, 2024 | 5:33 PM

Share

పై ఫొటోలో ఉన్న పిల్లాడిని గుర్తు పట్టారా? ఇతను టాలీవుడ్ లో మోస్ట్ ట్యాలెంటెడ్ యాక్టర్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అంతకు ముందు మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా కంప్లీట్ చేసిన ఈ నటుడు కొంతకాలం పాటు మల్టీమీడియా యానిమేటర్‌గా పనిచేశాడు. అయితే నటనపై మక్కువ ఉండడంతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. అన్ని రకాల పాత్రలు చేస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా తమిళ్ సినిమాల్లో కూడా నటిస్తూ అక్కడి ప్రేక్షకులను కూడా మెప్పిస్తున్నాడీ హ్యాండ్సమ్ హీరో. ఇటీవల ఓ హార్రర్ వెబ్ సిరీస్ తో ఓటీటీ ఆడియెన్స్ ను కూడా మెప్పించాడు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బ్రేకుల్లేని బండిలా దూసుకుపోతోన్న ఈ నటుడు ఎవరంటే.. అందాల రాక్షసి సినిమాతో యూత్ ను ఆకట్టుకున్న నవీన చంద్ర. ఇది అతని చిన్న నాటి ఫొటో. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న గేమ్ ఛేంజర్ సినిమాలో నవీన్ చంద్ర ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సినిమా ప్రమోషన్లలో భాగంగా అతను కూడా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలోనే నవీన్ చిన్న నాటి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

నవీన్ చంద్ర 2006లోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అయితే 2012లో వచ్చిన అందాల రాక్షసి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత దళం సినిమాతో విమర్శకుల ప్రశంసలు అంతుకున్నాడు. అయితే ఆ తర్వాత హీరోగా కొన్ని వైఫల్యాలు ఎదుర్కొన్నాడీ హీరో. దీంతో విలన్ అవతారమెత్తాడు. అరవంద సమేత, నేను లోకల్ తదితర సినిమాల్లో నెగెటివ్ రోల్స్ తో మెప్పించాడు. ఇక ఓటీటీలో రిలీజైన భానుమతి & రామకృష్ణ మూవీతో హీరోగా మంచి హిట్‌ కొట్టాడు. బాలయ్య వీర సింహారెడ్డి సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషించాడు. మంత్ ఆఫ్ మధులో మళ్లీ హీరోగా ఆకట్టుకున్నాడు.

ఇవి కూడా చదవండి

భార్యతో నవీన్ చంద్ర..

ఇక హార్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇన్‌స్పెక్టర్ రిషి నవీన్ చంద్రకు మంచి పేరు తీసుకు వచ్చింది. ప్రస్తుతం ఈ హీరో చేతిలో రామ్ చరణ్ గేమ్‌ చేంజర్ సినిమాతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

కుమారుడితో నవీన్ చంద్ర..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.