ఈ ఫొటోలోని అబ్బాయిని గుర్తుపట్టారా? సౌతిండియాలో ఫేమస్ హీరో.. యాక్టింగ్‌లో నెక్ట్స్ లెవెల్ అంతే
పై ఫొటోలో క్యూట్‌గా పోజిస్తోన్న అబ్బాయిని గుర్తుపట్టారా? ఇతను ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ హీరో. పుట్టింది తమిళనాటే అయినా తెలుగు రాష్ట్రాల్లోనూ ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే నేరుగా తెలుగు సినిమాలు కూడా చేశాడు. లవ్, కామెడీ, సీరియస్, యాక్షన్.. ఇలా ఏ జోనర్ సినిమాలకైనా ఇట్టే సూటవుతాడీ హీరో.

పై ఫొటోలో క్యూట్‌గా పోజిస్తోన్న అబ్బాయిని గుర్తుపట్టారా? ఇతను ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ హీరో. పుట్టింది తమిళనాటే అయినా తెలుగు రాష్ట్రాల్లోనూ ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే నేరుగా తెలుగు సినిమాలు కూడా చేశాడు. లవ్, కామెడీ, సీరియస్, యాక్షన్.. ఇలా ఏ జోనర్ సినిమాలకైనా ఇట్టే సూటవుతాడీ హీరో. తన నటనా ప్రతిభకు ఫిల్మ్‌పేర్, సైమా వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు కూడా అందుకున్నాడు. ఇటీవలే ఓ పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పీరియాడికల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాతో మరో సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అలా వరుస విజయాలతో సౌతిండియన్ సినిమా ఇండస్ట్రీలో జెట్ స్పీడ్‌లో దూసుకెళుతోన్న ఈ స్టార్ హీరో ఇవాళ (మే25) పుట్టిన రోజు జరుపుకొంటున్నాడు. అందుకే అతని చిన్ననాటి ఫొటోలు, అరుదైన పిక్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. పై ఫొటో కూడా అలాంటిదే. మరి ఈ స్టార్ హీరో గుర్తుపట్టారా? అతనెవరో కాదు.. సౌతిండియన్ వర్సటైల్ హీరో కార్తీ.
కార్తీ పుట్టిన రోజు సందర్భంగా అతని అభిమానులు, నెటిజన్లు అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల పొన్నియన్ సెల్వన్ 2 సినిమాతో మరో సూపర్ హిట్ మూవీని ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం అతను జపాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అనూ ఎమ్మాన్యుయేల్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. జపాన్‌లో సునీల్, విజయ్ మిల్టన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ప్రభు నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్నాడు.




View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..