
పై ఫొటోలో తెల్ల గౌను ధరించి దేవ కన్యలా మెరిసిపోతోన్న చిన్నారి ఎవరో గుర్తు పట్టారా? ఇప్పుడీ అమ్మాయి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిందీ అందాల తార. అయితే గతంలో స్టార్ హీరోల సినిమాల్లో కేవలం గ్లామరస్ రోల్స్ కే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు రూట్ మార్చింది. నటనకు ప్రాధాన్యమున్న సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తోంది. మరీ ముఖ్యంగా సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ జానర్ లకు సంబంధించిన లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. అంతే కాదు కొన్ని సినిమాల్లో హీరోలకు దీటుగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా చేస్తోంది. మరి ఇంతకు ఆ నటి ఎవరో గుర్తు పట్టారా? ఆమె మరెవరో కాదు రెజీనా కాసాండ్రా. గతంలో కంటే ఇప్పుడు తెలుగు సినిమాలు బాగా తగ్గించేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎక్కువగా తమిళ్, హిందీ సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. అందులోనూ నటనకు ప్రాధాన్యమున్న సినిమాలనే ఎంపిక చేసుకుంటోంది.
సుధీర్ బాబుతో కలిసి శివ మనసులో శృతి అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది రెజీనా. ఆ తర్వాత సందీప్ కిషన్ తో కలిసి ఆమె నటించిన రోటీన్ లవ్ స్టోరీ యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కొత్త జంట, రారా కృష్ణయ్యా, పిల్ల నువ్వ లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, పవర్, సౌఖ్యం, శౌర్యం, జో అచుతానంద సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. అయితే రెజీనాకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఏదంటే ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘ఆ’ అని చెప్పవచ్చు. ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రెజీనా అభినయం అందరినీ ఆకట్టుకుంది. అలాగే అడివి శెట్టి ‘ఎవరు’ సినిమాలోనూ నెగెటివ్ రోల్ పోషించిందీ అందాల తార. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం సెక్షన్ 108, జట్ కాకుండా, విదాముర్చి, ప్లాష్ బ్యాక్ వంటి చిత్రాల్లో నటిసస్తూ బిజీగా ఉంటోందీ ముద్దుగుమ్మ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.