Jabardasth Yodha: అచ్చతెలుగింటి అందమైన అమ్మాయి.. జబర్దస్త్ యోధను ఇప్పుడు చూశారా..?
ఎక్కడ చూసిన వీరి వీడియోస్ మాత్రమే కనిపించాయి. ఆ తర్వాత ఇద్దరు కలిసి యోధ సిస్టర్స్ గా పటాస్ ప్రోగ్రామ్ లోకి అడుగుపెట్టారు. యోధా సిస్టర్స్ పేరుతో అనేక స్కిట్స్ చేసి తక్కువ సమయంలోనే చాలా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చి తమ అల్లరి చేష్టలు, మాటలు, డైలాగ్స్ తో నవ్వించారు. ముఖ్యంగా తన ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అల్లరి పిల్ల యోధ. తన చేష్టలతో పిల్ల కాదు పిడుగు అనిపించేలా చేసింది యోధ.
జబర్దస్త్ కామెడీ షో.. ఎంతో మంది సెలబ్రెటీలకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అలాగే ప్రస్తుతం ఇండస్ట్రీలో నటీనటులుగా బిజీగా ఉన్న తారలు ఒకప్పుడు ఈషోలో కమెడియన్స్ గా చేసినవారే. బుల్లితెరపై ఒకప్పుడు సత్తా చాటిన ఈ షో ద్వారా ఎంతో మంది టాలెంటర్స్ తమ ప్రతిభను కనబర్చి.. ఇప్పుడు వెండితెరపై దూసుకుపోతున్నారు. అలాగే మరికొందరు బుల్లితెరపై పలు షోలలో అలరిస్తున్నారు. అయితే ఈ షోలో తనదైన కామెడీ పంచులతో నవ్వులు పూయించింది చిన్నారి యోధ. చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టి బుల్లితెరపై పలు రియాల్టీ షోలలో సందడి చేసింది. అత్తా కోడళ్లుగా రమ్య శ్రీ, యోధ చేసిన వీడియోస్ అప్పట్లో ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఎక్కడ చూసిన వీరి వీడియోస్ మాత్రమే కనిపించాయి. ఆ తర్వాత ఇద్దరు కలిసి యోధ సిస్టర్స్ గా పటాస్ ప్రోగ్రామ్ లోకి అడుగుపెట్టారు. యోధా సిస్టర్స్ పేరుతో అనేక స్కిట్స్ చేసి తక్కువ సమయంలోనే చాలా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చి తమ అల్లరి చేష్టలు, మాటలు, డైలాగ్స్ తో నవ్వించారు. ముఖ్యంగా తన ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అల్లరి పిల్ల యోధ. తన చేష్టలతో పిల్ల కాదు పిడుగు అనిపించేలా చేసింది యోధ.
ఆ తర్వాత దేశముదుర్లు షోలోను పాల్గొంది. చదువుల కోసం రమ్యశ్రీ నటనకు దూరం కాగా.. యోధ మాత్రం జబర్దస్త్ కామెడీ షోలో సందడి చేసింది. అవినాష్, కార్తీక్ టీంలో చేసిన యోధ చివరకు రాకింగ్ రాకేష్ టీంలోకి షిఫ్ట్ అయ్యింది. జబర్దస్త్ కామెడీ షోలో యోధ, దీవెన, రాకింగ్ రాకేష్ టీం తమ స్కిట్స్ తో ప్రేక్షకులను నవ్వించారు. ఈ షోకు యోధ, దీవెన స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. కేవలం బుల్లితెరపై షోస్ మాత్రమే కాకుండా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించింది యోధ. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమాలో చిన్ననాటి హీరోయిన్ పాత్రలో నటించింది. ప్రస్తుతం చదువుల నిమిత్తం జబర్దస్త్ షోకు దూరంగా ఉంటుంది యోధ. ఈ క్రమంలో తమ సొంతూరు ఖమ్మంకు షిఫ్ట్ అయ్యింది. షోస్, సినిమాలకు దూరంగా ఉన్న యోధ.. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.
తెలుగులోని సూపర్ హిట్ సాంగ్స్ కు రీల్స్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. అలాగే తన తండ్రి చందుతో కలిసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి పలు వీడియోస్ చేస్తుంది. ప్రస్తుతం యోధ ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ట్రెడిషనల్ డ్రెస్సింగ్, లంగావోణీలో అచ్చతెలుగింటి అందమైన అమ్మాయిల కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం యోధ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. త్వరలోనే యోధ హీరోయిన్ గా వెండితెరపై అలరించాలని.. మరో మహానటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.