Actress: మాటకు మాట.. ముక్కుసూటితత్వం.. పార్లమెంట్‌కు వెళుతోన్నఈ స్టార్ హీరోయిన్ ను గుర్తుపట్టారా?
ఈ ఫొటోలో క్యూట్ గా కనిపిస్తోన్న అమ్మాయిని గుర్తు పట్టారా? బాలీవుడ్ సినిమాలు చూసే వారు పోలికలు చూసి గుర్తు పట్టవచ్చు. ఈ క్యూటీ ఇప్పుడు హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. కెరీర్ ఆరంభంలో స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా గ్లామర్ ఒలకపోసినా ఆ తర్వాత మహిళా ప్రాధాన్య చిత్రాలకే ఓటేసింది.

ఈ ఫొటోలో క్యూట్ గా కనిపిస్తోన్న అమ్మాయిని గుర్తు పట్టారా? బాలీవుడ్ సినిమాలు చూసే వారు పోలికలు చూసి గుర్తు పట్టవచ్చు. ఈ క్యూటీ ఇప్పుడు హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. కెరీర్ ఆరంభంలో స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా గ్లామర్ ఒలకపోసినా ఆ తర్వాత మహిళా ప్రాధాన్య చిత్రాలకే ఓటేసింది. అన్నట్లు సినిమాలతో పాటు ఈ ముద్దుగుమ్మపై ఫైర్ బ్రాండ్ అనే ట్యాగ్ కూడా ఉంది. మాటకు మాట ఇవ్వడం.. ముక్కు సూటిగా వ్యవహరించడం ఈ అమ్మడి స్టైల్. ముఖ్యంగా నెపోటిజం (బంధుప్రీతి) పై తెగ మండిపడుతుంటుంది. బాలీవుడ్ లో స్టార్స్ గా చెలామణి అవుతున్నవాళ్లను తరచూ కడిగి పారేస్తుంటుంది. తన మాటతీరుకు తగ్గట్టుగానే ఇటీవలే లోక్ సభ ఎన్నికల బరిలోనిలిచింది. ఎంపీగా బంపర్ మెజారిటీతో గెలిచింది. త్వరలోనే పార్లమెంట్‌లోకి అడుగుపెడుతోన్న ఈ నటి ఎవరో ఈపాటికే అర్థమై ఉంటుంది. యస్.. తను మరెవరో కాదు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.
గత కొన్నేళ్లుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది కంగన రనౌత్. అందుకు తగ్గట్టుగానే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలోకి దిగింది. హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచింది. ఆమెకు ఏకంగా 74 వేలకుపైగా మెజార్టీ రావడం విశేషం. ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వీరభద్ర సింగ్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్‌పై కంగనా రనౌత్ విజయం సాధించింది. దీంతో ఈ ముద్దుగుమ్మ త్వరలోనే ఎంపీగా పార్లమెంట్ లోకి అడుగుపెట్టనుంది. కంగనా నటించిన ఎమర్జెన్సీ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా సార్వత్రిక ఎన్నికల్లో గెలిస్తే సినిమాల నుంచి తప్పుకుంటానని గతంలో కంగనా ప్రకటించింది.
విజయానంతరం కంగనా కామెంట్స్..
Kangana expressed her emotions, stating she feels grateful to the people of Mandi for electing the BJP and appreciates the good governance of PM Modi. ❤️#ElectionsResults #WomenPower #400Paar #KanganaRanaut #Hindus #Mandi #HimachalPradesh #लोकसभा_आमचुनाव_2024 pic.twitter.com/nRY8YDotJk
— Rahul Chauhan (@RahulCh9290) June 4, 2024
కంగనా సంబరాలు..
माता ईश्वर का रूप है, आज मेरी माँ मुझे दही शक्कर खिलाती हुई 🥰🙏 pic.twitter.com/07O66nC5O0
— Kangana Ranaut (Modi Ka Parivar) (@KanganaTeam) June 4, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








