Tollywood: యూత్ గుండెల్లో అలజడి సృష్టించిన హీరోయిన్ ఈ చిన్నారి.. టాలీవుడ్ సెన్సెషన్ ఇప్పుడు సైలెంట్..
ఫస్ట్ మూవీ విడుదలకు ముందే యూత్ గుండెల్లో అలజటి సృష్టించింది. అంతేకాదు.. అందం, అమాయకత్వంతో వెండితెరపై ఎంతో మంది హృదయాలను దొచుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా మారిపోయింది. కానీ ఆ అదృష్టం ఎక్కువ రోజులు నిలబడలేదు. ఎంత వేగంగా స్టార్ డమ్ అందుకుందో.. అంతేవేగంగా అవకాశాలకు దూరమయ్యింది. ఇప్పుడు కేవలం చేతిలో రెండు సినిమాలతో నెట్టుకోస్తుంది. ఎవరో గుర్తుపట్టారా ?..

దక్షిణ చిత్రపరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఈ చిన్నారి ఒకరు. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో సెన్సెషన్ సృష్టించింది. ఫస్ట్ మూవీ విడుదలకు ముందే యూత్ గుండెల్లో అలజటి సృష్టించింది. అంతేకాదు.. అందం, అమాయకత్వంతో వెండితెరపై ఎంతో మంది హృదయాలను దొచుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా మారిపోయింది. కానీ ఆ అదృష్టం ఎక్కువ రోజులు నిలబడలేదు. ఎంత వేగంగా స్టార్ డమ్ అందుకుందో.. అంతేవేగంగా అవకాశాలకు దూరమయ్యింది. ఇప్పుడు కేవలం చేతిలో రెండు సినిమాలతో నెట్టుకోస్తుంది. ఎవరో గుర్తుపట్టారా ?.. తనే హీరోయిన్ కృతి శెట్టి. డైరెక్టర్ బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఉప్పెన సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది.
ఇందులో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించగా.. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ప్రతినాయికుడిగా కనిపించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో ఈ బ్యూటీకి అవకాశాలు క్యూకట్టాయి. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు సినిమాలతో మరిన్ని విజయాలు అందుకుంది. కానీ ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు నటించిన సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఎల్ఐసీ సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రానికి డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
View this post on Instagram
ఈ సినిమా కాకుండా తెలుగులో హీరో శర్వానంద్ జోడిగా నటిస్తుంది. అలాగే మలయాళంలో ఓ పాన్ ఇండియా ప్రాజెక్టులో నటిస్తుంది. ప్రస్తుతం కృతి.. తమిళంలో 3 సినిమాలతో కలిపి మొత్తం 5 చిత్రాల్లో నటిస్తుంది. అంతేకాకుండా కృతికి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు ఇన్ స్టాలో 70 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం కృతి శెట్టి చిన్ననాటి ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.