Tollywood: సూర్యోదయాన తనో అద్భుతం.. సూర్యాస్తమయాన తనో పరిమళం.. సూర్యుడు ఉండగానే కనింపించే వెన్నెల..
తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఎవరో గుర్తుపట్టండి. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ యమ యాక్టివ్. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది. అలాగే.. ఈ అమ్మడు సెలబ్రెటీ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది.

పైన ఫోటోలో ఉన్న ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ?.. నిజమే కదూ.. ఆమె అద్భుతమైన నటి. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే సినీ విశ్లేషకుల ప్రశంసలు అందకుంది. నయనాలతోనే నటించి ఔరా అనిపించుకుంది. ప్రస్తుతం వరుస చిత్రాలతో దక్షిణాదిలో అగ్రకథానాయికగా కొనసాగుతుంది. తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఎవరో గుర్తుపట్టండి. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ యమ యాక్టివ్. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది. అలాగే.. ఈ అమ్మడు సెలబ్రెటీ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఈ హీరోయిన్ తల్లిదండ్రులు ఇండస్ట్రీకి చెందిన వారే. తండ్రి నిర్మాత కాగా..తల్లి ప్రముఖ నటి. అయినా.. తన టాలెంట్‌తోనే సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎవరో గుర్తుపట్టండి. ఆ అందాల సుందరి ఎవరంటే తన అద్భుత నటనతో మహానటిని మరిపించిన హీరోయిన్ కీర్తి సురేష్.
నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మహానటి సినిమాతో ప్రశంసలు అందుకుంది. అలనాటి హీరోయిన్ సావిత్రి జీవితం ఆధారంగా వచ్చిన మహానటి సినిమాలో కీర్తి సురేష్ నటనకు ముగ్దులు కానీ ప్రేక్షకులుండరు. ఆ తర్వాత నేను లోకల్, అజ్ఞాతవాసి.. రంగ్ దే, సర్కారు వారి పాట చిత్రాల్లో నటించింది.




ప్రస్తుతం ఆమె చేతిలో దసరా.. భోళా శంకర్ చిత్రాలున్నాయి. న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న దసరా మూవీలో కీర్తి సురేష్ గ్రామీణ అమ్మాయి వెన్నెల పాత్రలో నటిస్తుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ చిత్రంలో చిరు చెల్లిగా కనిపించనుంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
