Tollywood: తెలుగువారికి ఇష్టమైన అమ్మాయి.. సహజ నటనకు పెట్టింది పేరు ఈ హీరోయిన్.. ఎవరంటే..
పైన ఫోటోలో తన తండ్రి పక్కన అమాయకంగా కూర్చున్న ఆ చిన్నారి ఎవరో తెలుసా..? తెలుగువారికి చాలా ఇష్టమైన అమ్మాయి. ఎలాంటి పాత్రలలోనైనా అవలీలగా నటించి ముద్దుగుమ్మ. తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తెలుగమ్మాయి అయిన ముందుగా తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
సోషల్ మీడియాలో కొన్ని నెలలుగా సినీతారల చిన్ననాటి ఫోటోస్ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా తమకు నచ్చిన సెలబ్రెటీస్ చైల్డ్ హుడ్ ఫోటోస్ షేర్ చేస్తున్నారు నెటిజన్స్. నెట్టింట దీనిని త్రోబ్యాక్ ట్రెండ్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఈ సరికొత్త ట్రెండ్ గురించి చెప్పక్కర్లేదు. స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ షేర్ చేస్తూ వారి బాల్యం జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ హీరోయిన్ చైల్డ్ హుడ్ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. పైన ఫోటోలో తన తండ్రి పక్కన అమాయకంగా కూర్చున్న ఆ చిన్నారి ఎవరో తెలుసా..? తెలుగువారికి చాలా ఇష్టమైన అమ్మాయి. ఎలాంటి పాత్రలలోనైనా అవలీలగా నటించి ముద్దుగుమ్మ. తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తెలుగమ్మాయి అయిన ముందుగా తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తనే హీరోయిన్ అంజలి. ఏపీకి చెందిన ఈ బ్యూటీ.. జీవా నటించిన డేర్ చిత్రంతో సినీరంగంలోకి తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత 2006లో ఫోటో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే ఈ రెండు సినిమాలు అంజలికి అంతగా గుర్తింపు తీసుకురాలేదు. కానీ తమిళంలో వచ్చిన షాపింగ్ మాల్ సినిమాతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్ చేయగా మంచి విజయాన్ని అందుకుంది.
షాపింగ్ మాల్ సినిమా తర్వాత డైరెక్టర్ మురుగదాస్ జర్నీ చిత్రంలో ఆమెకు అవకాశం ఇచ్చారు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత అంజలి ఖాతాలో వరుస హిట్స్ పడ్డాయి. 2013లో విడుదలైన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీతగా.. పక్కింటి అమ్మాయిలా కనిపించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. అమాయకంగా కనిపిస్తూనే.. కల్లాకపటం ఎరుగని అమ్మాయిగా అంజలి నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు కంటెంట్, నటన ప్రాధాన్యత ఉన్ నచిత్రాల్లో నటిస్తుంది. ఇటీవల విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, బహిష్కరణ చిత్రాల్లో వేశ్య పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.