Tollywood: ఈ అమ్మాయి ఇప్పుడు కుర్రాళ్లకు హాట్ ఫేవరేట్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

తెలుగులో తక్కువ సినిమాలే చేసిన ఈ కేరళ కుట్టికి నెట్టింట ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. అద్భుతమైన నటనతో తెలుగు అడియన్స్ గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఫస్ట్ మూవీ తర్వాత వరుస ఆఫర్స్ వచ్చినప్పటికీ అచి తూచి సినిమాలను సెలక్ట్ చేసుకుంటుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ?

Tollywood: ఈ అమ్మాయి ఇప్పుడు కుర్రాళ్లకు హాట్ ఫేవరేట్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?
Actress
Follow us

|

Updated on: Sep 12, 2024 | 4:09 PM

ఇప్పుడిప్పుడే తెలుగు సినీ పరిశ్రమలో కుర్ర హీరోయిన్ల జోరు కొనసాగుతుంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని ఆ తర్వాత వరుస ఆఫర్స్ సొంతం చేసుకున్న స్టార్స్ చాలా మంది ఉన్నారు. అందం, అభినయంతో వెండితెరపై సందడి చేసి.. కుర్రాళ్ల హాట్ ఫేవరేట్ గా మారిన తారల గురించి చెప్పక్కర్లేదు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. తెలుగులో తక్కువ సినిమాలే చేసిన ఈ కేరళ కుట్టికి నెట్టింట ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. అద్భుతమైన నటనతో తెలుగు అడియన్స్ గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఫస్ట్ మూవీ తర్వాత వరుస ఆఫర్స్ వచ్చినప్పటికీ అచి తూచి సినిమాలను సెలక్ట్ చేసుకుంటుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ? తనే హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్. ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటిన హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు.

2022లో రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్. అయితే ఈ సినిమాతో ఈ బ్యూటీకి అంతగా గుర్తింపు రాలేదు. కానీ ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ నటించిన మ్యాడ్ సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో అందం, అభినయంతో కుర్రాళ్లను కట్టిపడేసింది. ఈ మూవీతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఈ మూవీ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి. ఇటీవల రజినీకాంత్ నటించిన లాల్ సలామ్ చిత్రంలో కనిపించింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం డైరెక్టర్ ఫణింద్ర నర్సెట్టి రూపొందిస్తున్న ఎనిమిది వసంతాలు చిత్రంలో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన లుక్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో అనంతిక మరింత అద్భుతంగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కేరళకు చెందిన అనంతిక 2000లో జన్మించింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఇన్ స్టాలో 885k ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా నెట్టింట అనంతిక షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.