Tollywood: చిరంజీవి పక్కనే ఉన్న ఆ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా ?.. పేరు వింటే అభిమానులకు పూనకాలే..
చిరుకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్, త్రోబ్యాక్ పిక్స్, వీడియోస్ నెట్టింట షేర్ చేస్తూ అన్నయ్యకు బర్త్ డే విషెస్ తెలిపారు మెగా ఫ్యాన్స్. ఈ క్రమంలోనే చిరుకు సంబంధించిన ఓ రేర్ పిక్ అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో చిరు బర్త్ డే కేక్ కట్ చేస్తుండగా.. పక్కనే మరో కుర్రాడు నిల్చొని ఉన్నాడు. అతను టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరో.
![Tollywood: చిరంజీవి పక్కనే ఉన్న ఆ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా ?.. పేరు వింటే అభిమానులకు పూనకాలే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/08/actor-2.jpg?w=1280)
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. మరోవైపు సోషల్ మీడియా వేదికగా చిరుకు బర్త్ డే విషెస్ తెలిపారు సినీ, రాజకీయ ప్రముఖులు. అలాగే చిరుకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్, త్రోబ్యాక్ పిక్స్, వీడియోస్ నెట్టింట షేర్ చేస్తూ అన్నయ్యకు బర్త్ డే విషెస్ తెలిపారు మెగా ఫ్యాన్స్. ఈ క్రమంలోనే చిరుకు సంబంధించిన ఓ రేర్ పిక్ అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో చిరు బర్త్ డే కేక్ కట్ చేస్తుండగా.. పక్కనే మరో కుర్రాడు నిల్చొని ఉన్నాడు. అతను టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరో. అతని పేరు చెబితే అభిమానులకు పూనకాలే. ఇక ఆ హీరో సినిమా వస్తే థియేటర్లలో రచ్చే. ఎవరో గుర్తుపట్టే ఉంటారు కదా. మీరు అనుకున్నట్లే అతను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చిరు తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. గోకులంలో సీత, తమ్ముడు, ఖుషి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని నటనతో ప్రశంసలు అందుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయినకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పవన్ తన ఇన్ స్టా వేదికగా ఈ స్పెషల్ పిక్ షేర్ చేశారు. తన చిన్ననాటి సమయంలో చిరు పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ ఫోటోను పంచుకుంటూ.. అడుగడుగునా స్పూర్తినిచ్చిన అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఇన్ స్టాలో రాసుకొచ్చారు పవన్. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరలవుతుండగా.. ఈ అరుదైన పిక్ చూసి సంతోషపడుతున్నారు మెగా ఫ్యాన్స్.
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/08/samantha-22.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/08/neha-shetty-dj-tillu-2.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/08/megastar-chiranjeevi-9.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/08/slum-dog-husband.jpg)
View this post on Instagram
పవన్ కు చిరంజీవి మీద ఉండే అభిమానం, ప్రేమ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే అనేకసార్లు అన్నయ్య పై తనకున్న ప్రేమ గురించి చాలాసార్లు చెప్పుకొచ్చారు పవన్. అలాగే చిరు తనయుడు రామ్ చరణ్ అంటే పవన్ కు ఎంతో ప్రేమ. అసలు తాను హీరో కావాలని ఎప్పుడూ అనుకోలేదని.. వ్యవసాయం చేసుకుంటూ గడిపేయాలని అనుకున్నాని..కానీ తన వదిన సురేఖ తనను ప్రోత్సహించి సినిమాల్లోకి అడుగుపెట్టేలా చేసిందని గతంలో బ్రో ప్రీరిలీజ్ ఈవెంట్లో చెప్పుకొచ్చారు పవన్.
View this post on Instagram
ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే.. ఓవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు పవన్. ఆయన నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరి హర వీరమల్లు సినిమాలు సెట్స్ పై ఉండగా.. ఇటీవలే బ్రో చిత్రం విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అభిమానులకు మరిన్ని అంచనాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత పవన్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. గతంలో విడుదలైన టీజర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది.
Ippude modalayyindi……. https://t.co/YMk8qn6jTn
— Harish Shankar .S (@harish2you) May 11, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.