aha OTT: ‘ఆహా’లో ఉన్నవి, రాబోతున్న మంచి కంటెంట్ సినిమాలు ఇవే..

భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకుడిని ఆకట్టుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. మొన్నటిదాకా వాటిని చూసే అవకాశం ఆయా భాషల వాళ్ళకు మాత్రమే ఉండేది.

aha OTT: 'ఆహా'లో ఉన్నవి, రాబోతున్న మంచి కంటెంట్ సినిమాలు ఇవే..
Aha Ott
Follow us
Ram Naramaneni

|

Updated on: May 26, 2021 | 10:22 PM

భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకుడిని ఆకట్టుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. మొన్నటిదాకా వాటిని చూసే అవకాశం ఆయా భాషల వాళ్ళకు మాత్రమే ఉండేది. ఇప్పుడు డిజిటల్ స్క్రీనింగ్ అనే రెవెల్యూషన్ వచ్చాక.. అడ్డుగోడలన్నీ బద్దలైపోయ్యాయి. ముఖ్యంగా మలయాళంలో హిట్టయిన నాణ్యమైన సినిమాల్ని తెలుగు ప్రేక్షకుడికి పరిచయం చేయడంలో ముందుంది ‘ఆహా’ యాప్. ఆట పాటలతో, చెలాకీ మాటలతో మాత్రమే మనల్ని ఫిదా చేసిన సాయిపల్లవి సడన్ గా టెరిఫిక్ క్యారెక్టర్లోకి ట్రాన్స్ ఫామ్ అయ్యారు. ఫహద్ ఫాజిల్ తో కలిసి ఆమె నటించిన ‘అనుకోని అతిధి’ ఈనెల 28 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇటువంటి సైకో థ్రిల్లర్స్ మాత్రమే కాదు.. మలబారు నేలపై సూపర్ హిట్ అయిన అనేక రకాల జానర్లు.. తెలుగు ప్రేక్షకుడికీ దగ్గరయ్యాయి.. వయా ఆహా ఓటీటీ.

భారీ యాక్షన్‌ సీన్స్… పవర్‌ఫుల్‌ డైలాగ్స్ ఉండకపోవచ్చు… కడుపుబ్బా నవ్వించే కామెడీ పంచ్‌లూ లేకపోవచ్చు. కానీ.. రెండున్నర గంటల పాటు ఆడియెన్స్ ని కట్టిపడేసే ఖతర్నాక్ కంటెంట్ మాత్రం వాటికే సొంతం. నేషనల్ అవార్డు తీసుకొచ్చిన జల్లికట్టుతో పాటు.. ఫోరెన్సిక్, మిడ్ నైట్ మర్డర్స్ లాంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ కూడా ఆహా ద్వారా అందరినీ అలరించినవే. అరుదైన ప్రేమకథ ‘మాయానది’… రిలీజియస్ సెంటిమెంట్స్ ప్లస్ హ్యూమన్ సైకాలజీ కలిపి చేసిన ‘ట్రాన్స్’… ఇవన్నీ తెలుగు ఆడియెన్స్ కి ఫ్రెష్ ఫీలింగ్ కలిగించివే. ఫహద్ ఫాజిల్, టోవినో థామస్ లాంటి ఉత్తమ నటుల బెటర్ పెర్ఫామర్స్ ని మనదాకా తీసుకొచ్చి క్వాలిటేటివ్ సినిమాపై అవేర్ నెస్ కలిగిస్తోంది ఆహా ఓటీటీ.

Also Read: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్తగా 18,285 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల వివ‌రాలు ఇలా ఉన్నాయి

వచ్చే నెలలో ఏపీలో అమలు కానున్న పథకాలు ఇవే.. ప్రకటించిన సీఎం జ‌గ‌న్