Varun Tej’s Ghani: మొదటి పంచ్ విసిరిన మెగా హీరో.. వరుణ్ తేజ్ ‘గ‌ని’ ఫస్ట్ గ్లింప్స్ ..

వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ మెగాప్రిన్స్‌గా ప్రేక్ష‌కాభిమానుల‌ను మెప్పిస్తోన్న వ‌రుణ్‌తేజ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న తాజా చిత్రం `గ‌ని`.

Varun Tej's Ghani: మొదటి పంచ్ విసిరిన మెగా హీరో.. వరుణ్ తేజ్ ‘గ‌ని’ ఫస్ట్ గ్లింప్స్ ..
Varun
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 07, 2021 | 3:58 PM

Varun Tej’s Ghani: వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ మెగాప్రిన్స్‌గా ప్రేక్ష‌కాభిమానుల‌ను మెప్పిస్తోన్న వ‌రుణ్‌తేజ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న తాజా చిత్రం `గ‌ని`. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో  రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. బుధ‌వారం ‘గ‌ని’  ఫ‌స్ట్ పంచ్ అంటూ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.
గ్లింప్స్‌ను గ‌మ‌నిస్తే.. బాక్సింగ్ రింగ్‌లో వ‌రుణ్ తేజ్‌ను బ్యాక్ నుంచి చూపించారు. అత‌ను బాక్సింగ్ ఆట‌గాళ్లు ధ‌రించే జెర్సీని ధ‌రించి ఉన్నాడు. దానిపై ‘గ‌ని’ అనే పేరు క‌న‌ప‌డుతుంది. వ‌రుణ్‌తేజ్ ఫేస్‌ను రివీల్ చేయ‌గానే అత‌ను ఫంచ్ విసురుతాడు. గ‌ని.. క‌నివిని ఎరుగ‌ని అనే లైన్ బ్యాగ్రౌండ్‌లో వినిపిస్తుంది. ఇది వ‌ర‌కు చిత్రాల‌కు భిన్నంగా వ‌రుణ్‌తేజ్ ఈ మూవీలో స‌రికొత్త లుక్‌లో క‌నిపిస్తున్నాడు. డిసెంబ‌ర్ 3న ప్ర‌పంచ వ్యాప్తంగా ‘గ‌ని’ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ గ్లింప్స్ ద్వారా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు  హాలీవుడ్ చిత్రం టైటాన్స్‌, బాలీవుడ్‌లో సుల్తాన్ వంటి చిత్రాల‌కు యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ లార్నెల్ స్టోవ‌ల్‌, వ్లాడ్ రింబ‌ర్గ్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేయ‌డం విశేషం.
తెలుగు ఆడియెన్స్‌కు ఓ స‌రికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చేలా సినిమాను భారీ రేంజ్‌లో నిర్మించారని తెలుస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. డిసెంబ‌ర్ 3న ప్రపంచ వ్యాప్తంగా ‘గ‌ని’ చిత్రాన్ని భారీ రేంజ్‌లో విడుద‌ల చేయబోతున్నారు. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన చంద్ర త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి జార్జ్ సి.విలియ‌మ్స్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి : 

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!