‘జార్జి రెడ్డి’ మూవీ రివ్యూ : ఎగసిపడ్డ కెరటం..ఎందరికో ఆదర్శం

మూవీ: జార్జి రెడ్డి జానర్‌: బయోపిక్‌ తారాగణం: సందీప్‌ మాధవ్‌, మనోజ్‌ నందం, చైతన్య కృష్ణ, వినయ్‌ వర్మ, అభయ్‌, సత్య దేవ్ దర్శకత్వం: జీవన్‌ రెడ్డి సంగీతం: సురేష్‌ బొబ్బిలి నిర్మాత: అప్పిరెడ్డి ఇంట్రో: 50 ఏళ్ళ క్రితం నక్సలిజం ఊపందుకుంటున్న దశలో ఉస్మానియా యూనివర్శిటీలో అణగారిన వర్గాల నేతగా ఎదిగివచ్చిన జార్జిరెడ్డి ఇన్నాళ్ళకు మళ్ళీ వార్తల్లో వ్యక్తి అయ్యాడు. 1972లో క్యాంపస్‌లోనే హత్యకు గురైన జార్జిరెడ్డి జీవిత చరిత్రను అదే పేరుతో సినిమా తీయడం ఇప్పుడు రెండు వర్గాల మధ్య చర్చకు, […]

'జార్జి రెడ్డి' మూవీ రివ్యూ : ఎగసిపడ్డ కెరటం..ఎందరికో ఆదర్శం
Follow us
Ram Naramaneni

| Edited By: Srinu

Updated on: Nov 22, 2019 | 11:44 AM

మూవీ: జార్జి రెడ్డి జానర్‌: బయోపిక్‌ తారాగణం: సందీప్‌ మాధవ్‌, మనోజ్‌ నందం, చైతన్య కృష్ణ, వినయ్‌ వర్మ, అభయ్‌, సత్య దేవ్ దర్శకత్వం: జీవన్‌ రెడ్డి సంగీతం: సురేష్‌ బొబ్బిలి నిర్మాత: అప్పిరెడ్డి

ఇంట్రో:

50 ఏళ్ళ క్రితం నక్సలిజం ఊపందుకుంటున్న దశలో ఉస్మానియా యూనివర్శిటీలో అణగారిన వర్గాల నేతగా ఎదిగివచ్చిన జార్జిరెడ్డి ఇన్నాళ్ళకు మళ్ళీ వార్తల్లో వ్యక్తి అయ్యాడు. 1972లో క్యాంపస్‌లోనే హత్యకు గురైన జార్జిరెడ్డి జీవిత చరిత్రను అదే పేరుతో సినిమా తీయడం ఇప్పుడు రెండు వర్గాల మధ్య చర్చకు, విమర్శలకు దారి తీసింది. విభిన్నమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జీవన్‌రెడ్డి.. జార్జిరెడ్డి సినిమాను తీశారు. ఈయన గతంలో దళం అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. వంగవీటి మూవీ ఫేం సందీప్‌ మాధవ్‌.. జార్జిరెడ్డి పాత్రలో నటించాడు. ఈ తరానికి జార్జిరెడ్డిని పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ మూవీ తీసినట్లు దర్శక, నిర్మాతలు తెలిపారు. నేడు రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను ఎంతమేర అలరించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ:

ప్రస్తుతం టాలీవుడ్‌లో అన్ సంగ్ హీరోస్ జీవిత చరిత్రలను తెరకెక్కించేందుకు దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఆ క్రమంలో తెరపైకి వచ్చిన వ్యక్తి  జార్జి రెడ్డి. ఇతడు ఓ విద్యార్థి నాయ‌కుడు. చిన్న‌ప్ప‌టి నుంచీ భ‌గ‌త్ సింగ్, చేగువేరా స్ఫూర్తితో ఎదిగాడు. అమ్మ ప్రోద్బలంతో అతడు చదువుతో పాటు కర్రసాము, కత్తిసాము, బాక్సింగ్ వంటి యుద్ధ విద్యల్లో ఆరితేరాడు. ఆ తర్వాత ఉన్నత విద్యను అభ్యసించడానికి ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లి.. అక్కడ విద్యార్ది లీడర్‌గా ఎదుగుతాడు. ఆ తర్వాత  అక్క‌డి అన్యాయాల‌కు ఎదురుతిరిగిన, పేద ప్రజల పక్షాన, రైతుల సమస్యలపై పోరాటం చేసిన జార్జి రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్‌గా మారతాడు.  ఈ క్రమంలో జార్జి రెడ్డికి కొంతమంది శ‌త్రువులు త‌యార‌య్యారు. వాళ్ల చేతుల్లో… పాతికేళ్ల వయసులోనే త‌న ప్రాణాలు కోల్పోయాడు. జార్జి రెడ్డి ఎందుకు హత్యకు గురవుతాడు? ఇంతకీ జార్జిరెడ్డిని ఎవరు హత్య చేస్తారు? అతడు స్టూడెంట్ లీడర్‌గా ఎటువంటి విజయాలు సాధించాడు? అతని ఆవేశానికి కారణాలు ఏంటి? అనే అంశాలు తెలియాలంటే సినిమా థియేటర్‌కి వెళ్లాల్సిందే.

చిత్రం ఎలా ఉంది?

ఇక ఈ సినిమా కోసం దర్శకుడు జీవన్ రెడ్డి చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. అప్పటి పరిస్థితులపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి..వాటిని తెరపై ప్రజంట్ చేయడంలో పూర్తి సక్సెస్ అయ్యాడు. సున్నితమైన అంశాలను.. ఎవరి మనోభావాలు నొచ్చుకోకుండా  అద్బుతంగా ప్రజంట్ చేశాడు. ఈ సినిమాలో యువతకు స్పూర్తినిచ్చే అంశాలు చాలా ఉన్నాయి. కథ మొదలుపెట్టిన తీరు, పాత్రల పరిచయం అంతా ఒద్దికగా ఉంటుంది. హీరోయిజాన్ని ఎలివేట్ చేేసే సీన్లు కూడా దర్శకుడు బాగా రాసుకున్నాడు. సెకండ్ హాఫ్ కాస్త స్లో అయ్యింది. డైలాగ్స్ హిందీ, ఇంగ్లీషులో ఉండి కాస్త ఇబ్బందిపెడతాయి. అమ్మ సెంటిమెంట్ బాగా పండింది.

ఎలా చేశారంటే:

జార్జి రెడ్డి లాంటి చాలా శక్తిమంత‌మైన పాత్ర‌కు సందీప్ ప్రాణం పోశాడు. జార్జి రెడ్డి..ఇలానే ఉంటాడేమో అనే రేంజ్‌లో అతని యాక్టింగ్ సాగింది. హీరోయిన్ ముస్కాన్ సినిమాకు ఆకర్షణగా నిలిచింది. సత్యదేవ్, అభయ్, మనోజ్ నందం, చైతన్య కృష్ణ లాంటి నటులు మూవీ స్థాయిని పెంచారు. యాక్షన్‌ సీన్స్‌ కూడా కొత్తగా వావ్ అనిపిస్తాయి. నేపథ్య సంగీతం కూడా బాగా కుదిరింది. సుధాకర్ యెక్కంటి సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. చిన్న సినిమానే అయినప్పటికీ నిర్మాత అప్పిరెడ్డి నిర్మాణ విలువలు గ్రాండ్‌గా అనిపిస్తాయి.

ప్లస్ పాయింట్:

సందీప్ నటన

మదర్ సెంటిమెంట్

నేపథ్య సంగీతం

దర్శకత్వం

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

సెకండ్ హాఫ్ సాగదీతగా సాగటం

డైలాగ్స్

ఫైనల్ థాట్ : ‘జార్జి రెడ్డి’- తెరపై నడుస్తోన్న… తెలుసుకోవాల్సిన జీవిత చరిత్ర