Tillu Square: టిల్లు 2 నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. అదరగొట్టిన టిల్లు అన్న
ఇప్పుడు మరో సారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు ఈ కుర్ర హీరో. టిల్లు స్క్వేర్ అనే టైటిల్ తో డీజే టిల్లు మూవీకి సీక్వెల్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది.

యంగ్ హీరో సిద్దూజొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు సినిమా మంచి హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ హ్యుజ్ హిట్ గా నిలిచింది. హీరో సిద్దు జొన్నలగడ్డ వన్ మ్యాన్ ఆర్మీగా ఈ సినిమాను నడిపించాడు. నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో తెలంగాణ యాసలో సిద్దు చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు మరో సారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు ఈ కుర్ర హీరో. టిల్లు స్క్వేర్ అనే టైటిల్ తో డీజే టిల్లు మూవీకి సీక్వెల్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ఈ మూవీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ మూవీ పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
తాజాగా ఈ సినిమానుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. టికెట్ లేకుండా అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ను రామ్ మిరియాల ఆలపించారు. కాసర్ల శామ్ ఈ పాటకు సాహిత్యం అందించారు. క్యాచీ పదాలతో ఈ పాట ఈ పాటకు సంగీతం కూడా రామ్ మిరియాల అందించారు.
ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సితార ఎంటర్టైమెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.
