లవర్ బాయ్ సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం ‘టక్కర్’. ఒకప్పుడు ప్రేమకథ చిత్రాలతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ నటుడు మొదటిసారి యాక్షన్ హీరోగా అవతారమెత్తాడు. అందులో భాగంగా చేసిన సినిమానే ‘టక్కర్’. కార్తీక్ జీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో ‘మజిలీ’ బ్యూటీ దివ్యాన్ష కౌషిక్ కథానాయికగా నటించింది.