Basha Shek |
Updated on: Jul 26, 2023 | 1:44 PM
బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ ఇంట సంతోషం వెల్లివెరిసింది. ఆమె ఇంట త్వరలో బుల్లి రనౌత్ అడుగుపెట్టనుంది.
కంగనా సోదరుడు అక్షత్- రీతూ దంపతులు త్వరలో అమ్మానాన్నలు కాబోతున్నారు. ఈక్రమంలో తాజాగా రీతూ సీమంతం వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి.
సీమంత వేడుకను పురస్కరించుకుని తన వదినకు బంగారు ఆభరణాలను బహుమతిగా ఇచ్చింది కంగన. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్తా వైరలయ్యాయి.
ఈ సందర్భంగా పింక్ కలర్ చీరలో, ఒంటినిండా జ్యువెలరీతో మెరిసిపోయింది కంగన. అలాగే చేతికి పెట్టుకున్న గోరింటాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఎమర్జెన్సీ అనే చిత్రంలో నటిస్తోంది కంగన. అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ మూవీ నవంబర్ 24న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.