AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalyan Ram: కళ్యాణ్ రామ్ మూవీ షూటింగ్‌లో అగ్ని ప్రమాదం.. మొత్తం కాలి బూడిదయ్యింది..

తాజాగా టాలీవుడ్ మూవీ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 4 కోట్లవరకు నష్టం జరిగిందని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆయన ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు.

Kalyan Ram: కళ్యాణ్ రామ్ మూవీ షూటింగ్‌లో అగ్ని ప్రమాదం.. మొత్తం కాలి బూడిదయ్యింది..
Kalyan Ram
Rajeev Rayala
|

Updated on: May 10, 2024 | 10:10 AM

Share

సినిమా షూటింగ్స్ లో ప్రమాదాలు జరగడం మనం చూస్తూనే ఉన్నాం.. ఇప్పటికే చాలా మంది హీరోలు కూడా గాయపడుతూ ఉంటారు. తాజాగా టాలీవుడ్ మూవీ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 4 కోట్లవరకు నష్టం జరిగిందని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆయన ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో అగ్నిప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్‌ చిలుకూరి ఓ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. విభిన్నమైన కథతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ సెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది.

ఈ సినిమా షూటింగ్‌ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. సినిమా కథ ప్రకారం.. సీబీఐకి సన్నివేశాలు సినిమాలో కీలకంగా ఉంటాయని తెలుస్తోంది. అయితే ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో సెట్ లో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ సీన్ కోసం ఓ ప్రత్యేకమైన సెట్ ను నిర్మించారట. పది రోజుల పాటు ఈ సెట్ లో షూటింగ్ చేయాల్సి ఉందట.. ఇప్పటికే 9 రోజుల షూటింగ్ పూర్తి కాగా చివరి రోజు ఈ అగ్ని ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. రాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందట.. సమాచారం తెలుసుకొని సెట్ కు వెళ్లేలోగా అంతా కాలి బూడిదైందని నిర్మాతకు దాదాపు 4 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
తెలంగాణ వైద్య శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గౌరవం..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు