ఆగ‌స్టు 7 నుంచి ఆన్‌లైన్ దేశ‌భ‌క్తి చ‌ల‌న చిత్రోత్స‌వం

నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎఫ్‌డిసి) ఆన్‌లైన్ దేశ‌భ‌క్తి చ‌ల‌న చిత్రోత్స‌వాన్ని నిర్వహించబోతుంది. ఈ నేప‌థ్యంలో ఆగస్టు 7 నుండి స్వాతంత్ర్య‌ దినోత్సవ నేపథ్య దేశభక్తి సినిమాలను ప్రదర్శించ‌నున్నారు.

ఆగ‌స్టు 7 నుంచి ఆన్‌లైన్ దేశ‌భ‌క్తి చ‌ల‌న చిత్రోత్స‌వం

online patriotic film festival : నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎఫ్‌డిసి) ఆన్‌లైన్ దేశ‌భ‌క్తి చ‌ల‌న చిత్రోత్స‌వాన్ని నిర్వహించబోతుంది. ఈ నేప‌థ్యంలో ఆగస్టు 7 నుండి స్వాతంత్ర్య‌ దినోత్సవ నేపథ్య దేశభక్తి సినిమాలను ప్రదర్శించ‌నున్నారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 2020 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగమైన ఈ ఉత్సవం ఆగస్టు 21 వరకు నడుస్తుంది.

ఈ ఉత్సవం ద్వారా స్వాతంత్య్ర సమరయోధుల ధైర్యాన్ని ప్ర‌పంచానికి చాటిచెప్ప‌నున్నారు. భారతీయ చరిత్రను ప్రదర్శించడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులలో ఉన్న‌ దేశభక్తిని చాట‌డ‌మే ల‌క్ష్యంగా ఈ కార్యక్ర‌మం నిర్వ‌హిస్తున్న‌ట్లు ఎన్‌ఎఫ్‌డిసి ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. హిందీ, మరాఠీ, తెలుగు, తమిళం, బెంగాలీ, గుజరాతీ, మలయాళంతో సహా వివిధ భారతీయ భాషలలో ప్రశంసలు పొందిన చిత్రాలు ఈ పండుగలో భాగం కానున్నాయి. వీటిలో 1996 లో శ్యామ్ బెనెగ‌ల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన “గాంధీ సే మహాత్మా తక్”, 1944 ప్రశంసలు పొందిన బెంగాలీ చిత్రం “ఉదయర్ పాథే”, మణిరత్నం తమిళ హిట్ “రోజా”, రాజ్‌కుమార్ సంతోషి తీసిన‌, “ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్” ఉన్నాయి. ఈ ఉత్సవంలో భాగంగా www.cinemasofindia.com వెబ్‌సైట్‌లో దేశ‌భ‌క్తి సినిమాలను ఉచితంగా ప్రసారం చేయ‌నున్నారు.

 

Also Read : తేజ ‘ష్–స్టోరీస్’ : గురువు ఆర్జీవీ బాట‌లో !

Click on your DTH Provider to Add TV9 Telugu