చేనేత చీరలో మెరిసిన గ్లోబల్ అందం

చేనేత చీరలో మెరిసిన గ్లోబల్ అందం

చేనేత మన వారసత్వ సంపద. ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే చేనేతను కాపాడుకోవడానికి ప్రయత్నాలు మొదులు పెట్టాయి. నేడు జాతీయ చేనేత దినోత్సవం సంద‌ర్భంగా ప‌లువురు సెల‌బ్రిటీలు భారతీయ వ‌స్త్రాల‌ని ధరించి సోషల్ మీడియాలో షేర్...

Sanjay Kasula

|

Aug 07, 2020 | 4:35 PM

చేనేత మన వారసత్వ సంపద. ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే చేనేతను కాపాడుకోవడానికి ప్రయత్నాలు మొదులు పెట్టాయి. నేడు జాతీయ చేనేత దినోత్సవం సంద‌ర్భంగా ప‌లువురు సెల‌బ్రిటీలు భారతీయ వ‌స్త్రాల‌ని ధరించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. చేనేత ప‌రిశ్ర‌మ‌కి స‌హ‌క‌రించాల‌ని నెటిజన్లను అభ్యర్థిస్తున్నారు.

వారు వీరు అంటే లేకుండా అంతా చేనేతకు చేయూతను ఇచ్చేందుకు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఇందులో నేను ముందుంటాను అంటోంది గ్లోబ‌ల్ భామ ప్రియాంక చోప్రా.  హ‌స్త‌క‌ళ ఎంతో గొప్ప‌దని… చేనేత‌ల‌కి చేనేత వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌కి మ‌న మ‌ద్ద‌తు ఇద్ధాం అంటూ ప్రియాంక త‌న ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. అంతే కాదు.. చీర ధ‌రించిన ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోతోపాటు మరో ఫోటోను షేర్ చేసింది. 2016లో ప‌ద్మ‌శ్రీ అవార్డ్ అందుకునే సంద‌ర్భంలోనిది. ఈ ఫోటోలో పీసీ నిమ్మ ఆకుపచ్చ జమ్దానీ ధరించింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu