కరోనా బాధితుల పాలిట ప్లాస్మా ఓ సంజీవని-చిరంజీవి

Plasma donation is life-saving for corona victims Chiranjeevi : కరోనాపై ముందు వరసలో ఉండి పోరాడుతున్న పోలీసులకు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు, వైద్యులు, పారిశిద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. ప్లాస్మా డొనేషన్ అనేది కరోనా బాధితుల పాలిట సంజీవనిగా నిలుస్తోందని ఆయన అభివర్ణించారు. కరోనా బాధితులకు ప్లాస్మా ఇస్తే 99 శాతం బతికే ఛాన్స్ ఉందని అన్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్‌లో ప్లాస్మా దాతలను సీపీ సజ్జనార్ […]

కరోనా బాధితుల పాలిట ప్లాస్మా ఓ సంజీవని-చిరంజీవి

Plasma donation is life-saving for corona victims Chiranjeevi : కరోనాపై ముందు వరసలో ఉండి పోరాడుతున్న పోలీసులకు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు, వైద్యులు, పారిశిద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. ప్లాస్మా డొనేషన్ అనేది కరోనా బాధితుల పాలిట సంజీవనిగా నిలుస్తోందని ఆయన అభివర్ణించారు. కరోనా బాధితులకు ప్లాస్మా ఇస్తే 99 శాతం బతికే ఛాన్స్ ఉందని అన్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్‌లో ప్లాస్మా దాతలను సీపీ సజ్జనార్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చిరంజీవి పాల్గొన్నారు.

ప్లాస్మా దాతలకు, వారి కుటుంబసభ్యులకు సీపీ సజ్జనార్ అభినందనలు తెలిపారు. సైబరాబాద్ పోలీసులు స్టార్ట్ చేసిన బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి చిరంజీవి ఎంతో సహాయపడ్డారని చెప్పారు. కరోనా విజేతలు ధైర్యంగా ప్లాస్మా దానం చేయాలని సీపీ పిలుపునిచ్చారు. కరోనాను జయించిన 3 నెలల్లోపే ప్లాస్మాను డొనేట్ చేయాల్సి ఉంటుందని, ప్లాస్మా యోధులు.. ప్రాణ దాతలంటూ సజ్జనార్ కొనియాడారు.

Click on your DTH Provider to Add TV9 Telugu