బ్రెజిల్‌లో కొనసాగుతు కరోనా మరణమృదంగం..!

బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తూనే ఉంది. నిత్యం ఆ దేశంలో వేలల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా మరణాల సంఖ్య భారీగా పెరుగుతుంది. బ్రెజిల్‌లో ఇప్పటివరకు 29,12,212 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యినట్లు బ్రెజిల్ జాతీయ ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. కాగా, ఇప్పటి వరకు బ్రెజిల్ దేశ వ్యాప్తంగా 98,493 మంది కరోనా బారినపడి ప్రాణాలొదిలారు.

బ్రెజిల్‌లో కొనసాగుతు కరోనా మరణమృదంగం..!
Follow us

|

Updated on: Aug 07, 2020 | 5:15 PM

బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తూనే ఉంది. నిత్యం ఆ దేశంలో వేలల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా మరణాల సంఖ్య భారీగా పెరుగుతుంది. బ్రెజిల్‌లో ఇప్పటివరకు 29,12,212 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యినట్లు బ్రెజిల్ జాతీయ ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. కాగా, ఇప్పటి వరకు బ్రెజిల్ దేశ వ్యాప్తంగా 98,493 మంది కరోనా బారినపడి ప్రాణాలొదిలారు. ఇక, గురువారం ఒక్కరోజే ఆ దేశంలో కొత్త 57,152 మందికి కొవిడ్ పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. కరోనాను జయించలేక గురువారం ఒక్కరోజే 1,437 మంది తీవ్ర ఇన్‌ఫెక్షన్ల కారణంగా మృతి చెందారు. అమెరికాలో ఇప్పటివరకు 4.8 మిలియన్లకు పైగా కరోనా కేసులు నమోదు కాగా సుమారు 3మిలియన్ల కేసులతో బ్రెజిల్ రెండోస్థానంలో కొనసాగుతోంది. మార్చి 11న ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్‌ను మహమ్మారిగా ప్రకటించింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 18.9 మిలియన్ల మంది వైరస్ బారినపడ్డారు. దాదాపు 7 లక్షల 12 వేల మంది కరోనాతో మృత్యువాతపడ్డారని అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో