ఎల‌క్ట్రిక‌ల్‌ వాహ‌నాల‌ పాల‌సీని లాంచ్ చేసిన సీఎం కేజ్రీవాల్

ఎల‌క్ట్రిక‌ల్ వాహ‌నాల వ‌ల్ల ఆర్థిక ప్ర‌యోజ‌నాలు చేకూర‌డంతో పాటు కాలుష్యం కూడా త‌గ్గించుకోవ‌చ్చ‌ని ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ వెల్ల‌డించారు. ఢిల్లీలో అమ‌లు చేయ‌నున్న విద్యుత్ వాహ‌నాల విధానాన్ని శుక్ర‌వారం ఆయ‌న విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ..

ఎల‌క్ట్రిక‌ల్‌ వాహ‌నాల‌ పాల‌సీని లాంచ్ చేసిన సీఎం కేజ్రీవాల్

ఎల‌క్ట్రిక‌ల్ వాహ‌నాల వ‌ల్ల ఆర్థిక ప్ర‌యోజ‌నాలు చేకూర‌డంతో పాటు కాలుష్యం కూడా త‌గ్గించుకోవ‌చ్చ‌ని ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ వెల్ల‌డించారు. ఢిల్లీలో అమ‌లు చేయ‌నున్న విద్యుత్ వాహ‌నాల విధానాన్ని శుక్ర‌వారం ఆయ‌న విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఢిల్లీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఈవిధానం చాలా ప్ర‌గ‌తిశీల‌మైంద‌న్నారు. మొత్తం ప్ర‌పంచంలో ఉన్న‌ మంచి విధానాల్లో ఒక‌ట‌ని ఈ సంద‌ర్భంగా సీఎం కేజ్రీవాల్ చెప్పారు. విద్యుత్‌తో న‌డిచే ద్విచ‌క్ర వాహ‌నాలు, ఆటో, స‌ర‌కు ర‌వాణా వాహ‌నాల‌కు రూ.30 వేలు, ఎల‌క్ట్రిక్ కార్ల‌కు రూ.1,50,000 వ‌ర‌కు రాయితీ ఇస్తామ‌న్నారు. కేంద్రం ఇచ్చే రాయితీకి ఇది అద‌న‌మ‌ని కేజ్రీవాల్ తెలిపారు. ఇంధ‌నంతో న‌డిచే వాహ‌నాల నుంచి విద్యుత్ వాహ‌నాల‌కు మ‌ళ్లిన వారికి రుణాల‌పై వ‌డ్డీ మాఫీతో పాటు, రిజిస్ట్రేష‌న్ రుసుము, రోడ్డు ట్యాక్స్ నుంచి మిన‌హాయింపు ఇస్తామ‌ని వివ‌రించారు. త‌మ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన విద్యుత్ వాహ‌న పాల‌సీ ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యోగాల క‌ల్ప‌న‌కు దోహ‌ద‌ప‌డటంతో పాటు దేశ రాజ‌ధానిలో కాలుష్యం స్థాయిలు క్ర‌మంగా త‌గ్గుతాయ‌ని కేజ్రీవాల్ చెప్పారు.

Read More:

మ‌రో ప్ర‌ముఖ న‌టి సూసైడ్, క‌ల‌క‌లం రేపుతోన్న ఆత్మ‌హ‌త్య‌లు!

ప్ర‌ముఖ‌ రచయిత, న‌టుడు ప‌రుచూరి వెంక‌టేశ్వ‌రరావు స‌తీమ‌ణి మృతి

కొత్తగా 13 మంది స‌బ్ క‌లెక్ట‌ర్‌ల‌ను నియ‌మించిన ఏపీ ప్ర‌భుత్వం

మాజీ క్రికెట‌ర్ స‌చిన్ టెండుల్క‌ర్‌పై అస‌భ్య‌క‌ర పోస్ట్‌, వ్య‌క్తి అరెస్ట్‌

Click on your DTH Provider to Add TV9 Telugu