RK Selvamani: తెలుగు రాష్ట్రాల్లో తమిళ సినిమాల షూటింగ్స్ జరపడంపై ఆర్కే సెల్వమణి అభ్యంతరం.. తమిళనాడులోనే జరపాలని డిమాండ్

RK Selvamani: తెలుగు రాష్ట్రాలలో(Telugu States) తమిళ సినిమాల (Tamil Movies) షూటింగ్ జరుపుకోవడంపై ఫెప్సీ  అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి అభ్యతరం తెలిపారు. అంతేకాదు కోలీవుడ్ సినిమాల..

RK Selvamani: తెలుగు రాష్ట్రాల్లో తమిళ సినిమాల షూటింగ్స్ జరపడంపై ఆర్కే సెల్వమణి అభ్యంతరం.. తమిళనాడులోనే జరపాలని డిమాండ్
Rk Selvamani
Follow us
Surya Kala

|

Updated on: May 04, 2022 | 6:52 AM

RK Selvamani: తెలుగు రాష్ట్రాలలో(Telugu States) తమిళ సినిమాల (Tamil Movies) షూటింగ్ జరుపుకోవడంపై ఫెప్సీ  అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి అభ్యతరం తెలిపారు. అంతేకాదు కోలీవుడ్(Kollywood )సినిమాల షూటింగ్ ను తమిళనాడు రాష్ట్రంలోనే జరపాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు చెన్నైలోని వడపళనిలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి విలేకరులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ‘సినిమా షూటింగ్స్ ఎవరితోనైనా చేయించుకునే అధికారం నిర్మాతలకు ఉంది అని తమిళ సినీ నిర్మాతల సంఘం ప్రకటన విడుదల చేసినట్టు మాకు ఎటువంటి సమాచారం లేదని అన్నారు. దీనికి సంబంధించి మాకు నేరుగా ఎలాంటి లేఖ అందలేదు. తమిళ సినీ నిర్మాతల సంఘం, ఫెప్సీ మధ్య సమన్వయలోపం ఉన్న మాట వాస్తవమే.. ఇప్పటికే సినిమా షూటింగు వివాదం, సినీ కార్మికుల వేతనాలపై నిర్మాతల మండలతో చర్చించాం.. ఈరోజు ఉదయం మళ్ళీ చర్చలు జరగనున్నాయని చెప్పారు. తప్పకుండ మా అభ్యర్ధనలను తమిళ నిర్మాతల మండలి అంగీకరిస్తుందని భావిస్తున్నామని చెప్పారు.

నటుడు రజినీకాంత్ , విజయ్ , అజిత్ కుమార్ లాంటి వారు తమ సినిమా షూటింగ్ లను హైదరాబాద్ , వైజాగ్ లాంటి మరో రాష్ట్రంలోని నగరాలలో చేస్తుండటంతో తమిళనాడులోని సినీ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి, అగ్రహీరోలు తమ సినిమా షూటింగ్ లను తమిళనాడులో షూట్ చేయాలన్నది తమ డిమాండ్ ని చెప్పారు.

ముఖ్యంగా నటుడు అజిత్ కుమార్, దర్శకుడు వినోద్, నిర్మాత బోనీ కపూర్‌లకు ఇదే మా విజ్ఞప్తి..  గతం లో నిర్మించిన కొన్ని పెద్ద సినిమాల రెవిన్యూ లో మాకు వచ్చింది ఏమి లేదు. రెవిన్యూ తెలుగు రాష్ట్రాలకి , ఆదాయం మీకు వచ్చింది. మాకు మిగిలింది ఏంటి ..  రాష్ట్ర ప్రభుత్వ సహకారం తో 15 ఎకరాలలో సినిమా నిర్మాణాలకు స్థలం కేటాయించింది.. కాబట్టి మన దగ్గర సినిమా నిర్మాణానికి ప్రస్తుతం చెన్నైలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని నటుడు రజినీకాంత్ కి, విజయ్‌కి విన్నవించగా, ఇరువురు మా అభ్యర్థనను అంగీకరించారు. నటుడు అజిత్ కూడా త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకోని తమిళ సినీ పరిశ్రమని నమ్ముకొని ఉన్న వేలాది మంది కార్మికులను కాపాడాలని కోరుకుంటున్నట్టు ఫెప్సీ అధ్యక్షుడు ఆర్ కె సెల్వమణి మీడియా కి తెలిపారు.

Also Read: Hyderabad Rains: భాగ్యనగరంలో వర్షం బీభత్సం… రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం

Gold Silver Price Today: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర.. తగ్గిన వెండి..!