AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Marokkasari: ఫీల్ గుడ్ లవ్‌స్టోరీగా మరొక్కసారి.. ఆకట్టుకుంటున్న ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్

టాలీవుడ్ లో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా తెరకెక్కి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ క్రేజీ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మరొక్కసారి అనే సినిమా రానుంది.

Marokkasari: ఫీల్ గుడ్ లవ్‌స్టోరీగా మరొక్కసారి.. ఆకట్టుకుంటున్న ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్
Marokkasari
Rajeev Rayala
|

Updated on: Aug 12, 2025 | 7:57 AM

Share

నరేష్ అగ‌స్త్య‌, సంజ‌నా సార‌థి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఫీల్ గుడ్ ల‌వ్‌స్టోరీ ‘మరొక్కసారి’. సి.కె.ఫిల్మ్ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై బి.చంద్ర‌కాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం నితిన్ లింగుట్ల. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను కంప్లీట్ చేసుకుంటోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

ఇదికూడా చదవండి : ఏం పార్థు నన్నే మర్చిపోయావా..? నేను నీ పద్దుని.. ఎంత మారిపోయింది ఈ చిన్నది..

‘మరొక్కసారి’ మూవీకి భరత్ మాంచి రాజు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో మొత్తంగా ఆరు పాటలుంటాయి. ఈ పాటను టాలీవుడ్ టాప్ సింగర్లు ఆలపించారు. ప్రముఖ గాయకులు కార్తిక్, ప్రదీప్ కుమార్, దేవన్ ఏకాంబరం, జాస్సీ గిఫ్ట్ వంటి వారు పాటల్ని పాడారు. ఇప్పటికే పాటలకు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయింది. అందమైన ప్రేమ కథా చిత్రానికి విజువల్స్ మరింత అందాన్ని తీసుకు రాబోతోన్నాయి. ఈ చిత్రాన్ని కేరళ, సిక్కిం, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఇంత వరకు ఏ ఇండియన్ సినిమా కూడా షూటింగ్ చేయనటువంటి గురుడోంగ్మార్ లేక్ వంటి ప్రదేశంలో ఈ ‘మరొక్కసారి’ చిత్రీకరణ జరుపుకుంది.

ఇదికూడా చదవండి :143 Movie : ఎన్నాళ్లకు కనిపించింది..!! 143 హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా..

5,430 మీ. ఎత్తులో ఉండే గురుడోంగ్మార్ లేక్‌లో షూటింగ్ చేసిన ఏకైక, మొట్టమొదటి ఇండియన్ మూవీగా ‘మరొక్కసారి’ నిలిచింది. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ పోస్టర్‌ను చూస్తుంటే ఓ ఆహ్లాదకరమైన ప్రేమ కథను చూడబోతోన్నామని అర్థం అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో నరేష్ అగస్త్య, సంజనాతో పాటు బ్రహ్మాజీ, సుధర్షన్, వెంకట్, వెంకట్ కాకమాను, దివ్యవాణి తదితరులు నటించారు. ఈ మూవీకి కెమెరామెన్‌గా రోహిత్ బచు, సంగీత దర్శకుడిగా భరత్ మాంచిరాజు, ఎడిటర్‌గా చోటా కే ప్రసాద్ పని చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదికూడా చదవండి : 53 సినిమాలు చేసింది.. హీరోయిన్‌గానే కాదు స్పెషల్ సాంగ్స్‌లోనూ దుమ్మురేపింది.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి