Amitabh Bachchan: బచ్చన్‌ జీ… ఈ ఒక్క మ్యాచ్‌కు దూరంగా ఉండరూ!.. బిగ్ బికి ఫ్యాన్స్ స్వీట్ వార్నింగ్

ప్రపంచకప్ బిగ్ ఫైనల్‌కు ఇక కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఇక, హోటళ్లు, రెస్టారెంట్లతోపాటు కూడళ్లలో బిగ్ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. టీమిండియా ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్ కొట్టాలని కోరుకుంటున్న అభిమానులు బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్‌నుమ్యాచ్ చూడొద్దని, తమ కోసం త్యాగం చేయాలని కోరుతున్నారు. దీని వెనక ఓ కారణం కూడా ఉంది. ఆయన కనుక మ్యాచ్‌ను వీక్షిస్తే భారత్ ఓడిపోతుందని వారు భావిస్తున్నారు.

Amitabh Bachchan: బచ్చన్‌ జీ... ఈ ఒక్క మ్యాచ్‌కు దూరంగా ఉండరూ!.. బిగ్ బికి ఫ్యాన్స్ స్వీట్ వార్నింగ్
Amitabh Bachchan
Follow us

|

Updated on: Nov 18, 2023 | 10:17 AM

ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడుతుంటే చూడాలని ఎవరికి ఉండదు. దేశంలోని ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఆదివారం తుదిపోరు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఆ ఫైనల్‌ను చూడొద్దంటూ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ను అభిమానులు కోరుతున్నారు. ప్రపంచకప్ బిగ్ ఫైనల్‌కు ఇక కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఇక, హోటళ్లు, రెస్టారెంట్లతోపాటు కూడళ్లలో బిగ్ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. టీమిండియా ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్ కొట్టాలని కోరుకుంటున్న అభిమానులు బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్‌ను మ్యాచ్ చూడొద్దని, తమ కోసం త్యాగం చేయాలని కోరుతున్నారు. దీని వెనక ఓ కారణం కూడా ఉంది. ఆయన కనుక మ్యాచ్‌ను వీక్షిస్తే భారత్ ఓడిపోతుందని వారు భావిస్తున్నారు. అందుకనే తమ కోసం ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండి త్యాగం చేయాలని కోరుతున్నారు.

సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన తర్వాత అమితాబ్ తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. తాను చూడకపోతేనే మనం మ్యాచ్‌ గెలుస్తామని చెప్పారు. ఇది కాస్తా వైరల్ అవడంతో అభిమానులు ఈవిధంగా స్పందిస్తున్నారు.

దయచేసి ఈ ఒక్కసారి జట్టు కోసం త్యాగం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వెల్లువెత్తుతున్న అభ్యర్థనలపై తాజాగా స్పందించిన అమితాబ్.. ఆ మ్యాచ్‌కు వెళ్లాలా? వద్దా? అని ఇప్పుడు ఆలోచిస్తున్నా అని మరోసారి ఎక్స్‌లో పోస్టు చేశారు. టీమ్‌ఇండియా ఆడేటప్పుడు ఇలాంటి నమ్మకాలను అమితాబ్‌ పాటిస్తారని 2011లో ఆయన కుమారుడు అభిషేక్‌ వెల్లడించారు.

అమితాబ్ బచ్చన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలు, సిరీస్‌లివే
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
2023ని ఎప్పటికి మర్చిపోలేం అంటున్న స్టార్ హీరోయిన్స్.. ఎందుకంటే ?
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
'బంగారం.. ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా?': విజయ్‌ ఆంటోని భార్య
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
కొత్త లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
పాత పద్ధతులకు స్వస్తి చెప్పిన బీజేపీ హైకమాండ్‌..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
లాంచింగ్ సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. హైలెట్ ఫీచర్స్..
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023
CSIR-కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023