Chiranjeevi: పెంకుటిల్లు మెగాస్టార్‌కి ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టిందో….ఇంతకీ ఆ ఇల్లు ఎవరిది.?
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు వెలితే చాలు ఆ ఇంటి లోపలికి వెళ్లి అందులో ఉండే వారి అనుమతితో గదులన్నీ కలయతిరిగి, సెల్ఫీలు తీసుకుని వెలుతుంటారు. అయితే అసలు ఇది చిరంజీవి సొంత ఇళ్లే నా , అయితే స్వగ్రామంలో ఉన్న ఈ ఇంటిని చిరంజీవి అంతటి వాడు ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చిందంటే ఎన్నో పుకార్లు షికార్లు చేసిన పరిస్థితి. ప్రజారాజ్యం ప్రచారం లో చిరంజీవి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం ఆ ఇంట్లోకి వెళ్లి తమ మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.

అది చూడటానికి సామాన్యమైన పెంకుటిల్లు. అందులో ఉండేది కూడా మామూలు వ్యక్తులు. కానీ ఆ గ్రామానికి వెళ్లిన కొత్త వాళ్లు ఖచ్చితంగా ఆ ఇంటికి వెళతారు. ఇంటి బయట నిలబడి సెల్ఫీ తీసుకుంటారు. ఏంటి ఆ ఇంటికి అంత స్పెషల్ అనుకుంటున్నారా…యస్. అది. ఇపుడు సాధారణ పెంకుటిల్లు కావచ్చు కానీ అందులో మెగాస్టార్ చిరంజీవి పుట్టి పెరిగారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆడుకున్నారు. ఇక అభిమానులకు ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు వెలితే చాలు ఆ ఇంటి లోపలికి వెళ్లి అందులో ఉండే వారి అనుమతితో గదులన్నీ కలయతిరిగి, సెల్ఫీలు తీసుకుని వెళ్తుంటారు. అయితే అసలు ఇది చిరంజీవి సొంత ఇళ్లేనా , అయితే స్వగ్రామంలో ఉన్న ఈ ఇంటిని చిరంజీవి అంతటి వాడు ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చిందంటే ఎన్నో పుకార్లు షికార్లు చేసిన పరిస్థితి. ప్రజారాజ్యం ప్రచారంలో చిరంజీవి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం ఆ ఇంట్లోకి వెళ్లి తమ మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. అంటే ఖచ్చితంగా ఇది వారు పెరిగిన ఇళ్లే. కానీ అదే ఇళ్లు ముఖ్యంగా మెగాస్టార్‌ను విమర్శలు పాలు చేసింది.
విమర్శకులు తమ సొంత అభిప్రాయాలతో ఇష్టానుసారంగా మాట్లాడటంతో చిరంజీవి రాజకీయంగా చాలా ఇబ్బంది పడ్డారు. మెగాస్టార్ సైతం ఓ ఇంటి కథ వెంటాడిందంటే అది మామూలు ఇళ్లు కాదు కదా. దాని కథేంటో ఇపుడు చూద్దాం. కొణిదెల శివ శంకర వరప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినీ పరిశ్రమలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా పశ్చిమగోదావరి నుంచి సినీ రంగం మీద మక్కువతో మద్రాసు వెళ్లి.. అక్కడ అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని, అంచెలంచెలుగా ఎదుగుతూ, ఎవరు అధిరోహించలేని విధంగా మెగాస్టార్ అనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు పద్మవిభూషణ్ చిరంజీవి. చిరంజీవి 1955 ఆగస్టు 22వ తేదీ వరప్రసాద్ అంజనాదేవి దంపతులకు నరసాపురంలోని మిషనరీ హాస్పిటల్ లో జన్మించారు. అప్పట్లో చిరంజీవి తండ్రి వరప్రసాద్ ఉద్యోగరీత్యా మొగల్తూరులోని పాతకాలవ సెంటర్లో ఓ పెంకుటింట్లో నివాసం ఉండేవారు. చిరంజీవి విద్యాభ్యాసం మొత్తం నరసాపురంలోనే సాగింది.
విద్యాభ్యాసం అనంతరం 1978లో సినీ రంగ ప్రవేశం చేసి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు చలనచిత్ర సినిమాలో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నారు చిరు. ఆయన మెగాస్టార్ గా ఉన్న సమయంలోనే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ స్థాపించి ఎంతోమందికి నేత్రదానం, రక్తదానం అందేలా చేసిన మహోన్నత వ్యక్తిగా పేరు పొందారు. 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి 2009లో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కేవలం 18 సీట్లకే పరిమితమైంది. ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లో పాలకొల్లులో సైతం ఆయన ఓటమి పాలయ్యారు. దానికి ప్రధాన కారణం ఆయన మీద ప్రతిపక్షాలు ఓ ప్రధాన అస్త్రాన్ని ఉపయోగించాయి. మొగల్తూరులో చిరంజీవి నివసించిన ఇల్లుని లైబ్రరీకి ఇవ్వకుండా రూ.3 లక్షలకు అమ్మేశారని జోరుగా ప్రచారం చేశారు. పుట్టి పెరిగిన సొంతూరికి రూ. 3 లక్షల ఇల్లు ఇవ్వలేని వ్యక్తి ప్రజాసేవ ఎలా చేస్తాడంటూ విమర్శల పాలు చేశారు. అయితే ఈ ప్రచారం చాలా కాలం కొనసాగింది. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ సినీ పరిశ్రమలు ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ఓ పెద్దన్నలా ఉండే చిరంజీవి రూ.3 లక్షలకు నిజంగా ఇల్లు అమ్మేశారా… అనే అనుమానం కలగక మానదు. ఇటీవల కరోనా సమయంలో కూడా కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేసిన చిరంజీవిపై ఈ అపవాదు రావడానికి కారణం ఏమిటి.. చాలామందికి తెలియని ప్రశ్నగా మిగిలిపోయింది.. అయితే చిరంజీవి మొగల్తూరులో నివసించింది వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు.. తండ్రి ఉద్యోగ నిమిత్తం చిరంజీవి అమ్మమ్మ ఇంట్లో నివసించేవారు. సినీ ఇండస్ట్రీలో వెళ్లాక ఆయన మద్రాస్ లో సెటిల్ అయ్యారు. ఆ ఇల్లుపై చిరంజీవికి ఎటువంటి అధికారం లేదు.. ఆ ఇంటిని తన మేనమామ వారి అవసరాల కోసం ఇతరులకు అమ్మేశారు. అయితే ఈ విషయం తెలియని చాలామంది సొంత ఊరిలో లైబ్రరీకి ఇల్లు ఇవ్వలేదని విష ప్రచారం చేయడంతో కొంతమంది అది నమ్మి నిజమే అనుకున్నారు. అయితే చిరంజీవి దీనికి ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని తన సొంత ఖర్చులతో మొగల్తూరులో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాక ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చాలా చోట్ల కోట్లాది రూపాయలు అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేశారు. ఇప్పటికీ ఆయా అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలపై ఆయన పేరు ముద్రించి ఉంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
