AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అభిమాని చేసిన పనికి షాక్.. చిలిపి అంటూ సిగ్గుపడిన నిధి అగర్వాల్

టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ బ్యూటీ పేరు తెచ్చుకుంది అందాల భామ నిధి అగర్వాల్. మున్నా మైఖేల్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆతర్వాత తెలుగులో సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. మిస్టర్ మజ్ను, ఆతర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది.

అభిమాని చేసిన పనికి షాక్.. చిలిపి అంటూ సిగ్గుపడిన నిధి అగర్వాల్
Nidhhi Agerwal
Rajeev Rayala
|

Updated on: Jul 08, 2025 | 7:42 AM

Share

అందాల భామ నిధి అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉంది. సవ్యసాచి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ చిన్నది ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. కానీ అంతగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ఆ సమయంలో పూరిజగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఈ అమ్మడికి మంచి విజయాన్ని అందించింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తన అందాలతో కవ్వించింది నిధి. ఆతర్వాత షరామామూలే.. నిధి అగర్వాల్ ఆతర్వాత హిట్ రుచి చూడలేదు. ఇక ఇప్పుడు ఏకంగా ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది. వాటిలో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహరవీర మల్లు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. హరిహరవీరమల్లు సినిమా కోసం నిధి గుర్రపు స్వారీ, కత్తి యుద్ధంలాంటివి నేర్చుకుంది ఈ చిన్నది.

ఇది కూడా చదవండి : అప్పుడు ఆవేశంలో ఆత్మహత్య చేసుకుందామనుకుంది.. కట్ చేస్తే ఇప్పుడు స్టార్ హీరోయిన్

ఈ సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. ఇదిలా ఉంటే ఇటీవలే వెంకటేష్ త్రివిక్రమ్ సినిమాలోనూ నిధి అగర్వాల్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారని కూడా టాక్ వినిపిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ అభిమానులతో అప్పుడప్పుడూ ముచ్చటిస్తూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :బాబోయ్.. ! ఈ ఫొటోలో ఉంది ఆ స్టార్ హీరోయినా..!! అస్సలు ఊహించలేరు గురూ..

సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని చేసిన పనికి తాను షాక్ అయ్యాను అని తెలిపింది నిధి. అభిమానులతో మాట్లాడుతుండగా ఓ ఫ్యాన్ మ్యారేజ్ టాపిక్ తీసుకొచ్చాడు అని తెలిపింది. ” మీ అమ్మగారి నెంబర్ ఇవ్వండి. మన పెళ్లి సంబంధం గురించి మాట్లాడతా. ప్లీజ్‌ ఇవ్వొచ్చుగా నిధి” అని అడిగాడట. దానికి నిధి అగర్వాల్ అవునా? చిలిపి.. అంటూ సమాధానం ఇచ్చింది.

ఇది కూడా చదవండి : అతను నా శరీరంలో అక్కడ చెయ్యివేశాడు.. పోలీసులకు చెప్తే ఇలా అన్నారు.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి
8 ఫోర్లు, 8 సిక్స్‌లు.. 62 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిన రోహిత్
8 ఫోర్లు, 8 సిక్స్‌లు.. 62 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిన రోహిత్
మీ సెల్‌ఫోన్ పోయిందా.. అయితే ఇలా చేయండి.!
మీ సెల్‌ఫోన్ పోయిందా.. అయితే ఇలా చేయండి.!
సీనియర్ హీరోయిన్ నిరోషా గుర్తుందా.. ?
సీనియర్ హీరోయిన్ నిరోషా గుర్తుందా.. ?
నిరుద్యోగులకు అలర్ట్.. రైల్వేలో 22,000 గ్రూప్‌ డి ఉద్యోగాలు
నిరుద్యోగులకు అలర్ట్.. రైల్వేలో 22,000 గ్రూప్‌ డి ఉద్యోగాలు
సాఫ్ట్‌వేర్ గర్ల్ ఫ్రెండ్.. బద్మాష్ బాయ్ ఫ్రెండ్.. ఇద్దరు కలిసి
సాఫ్ట్‌వేర్ గర్ల్ ఫ్రెండ్.. బద్మాష్ బాయ్ ఫ్రెండ్.. ఇద్దరు కలిసి
బీపీ ఒకేసారి ఎక్కువైతే ఏం చేయాలి..? వెంటనే ఇలా చేస్తే తగ్గుతుంది!
బీపీ ఒకేసారి ఎక్కువైతే ఏం చేయాలి..? వెంటనే ఇలా చేస్తే తగ్గుతుంది!
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి దారిలో ఏదో వస్తువు కనిపించింది..
సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తికి దారిలో ఏదో వస్తువు కనిపించింది..
ఆఖరికి సావే సచ్చిపోయింది.. రష్మిక మైసా గ్లింప్స్ రిలీజ్..
ఆఖరికి సావే సచ్చిపోయింది.. రష్మిక మైసా గ్లింప్స్ రిలీజ్..
కలబందతో కాస్త భద్రంగానే ఉండాలి.. లేదంటే, కథ అడ్డం తిరిగినట్టే..!
కలబందతో కాస్త భద్రంగానే ఉండాలి.. లేదంటే, కథ అడ్డం తిరిగినట్టే..!