సినీ సెలబ్రెటీల పై కేసు నమోదు.. లిస్ట్‌లో రానా, మంచు లక్ష్మీ, నిధి అగర్వాల్ కూడా..

బెట్టింగ్ యాప్స్ కారణంగా యువకులు, టీనేజర్స్.. పెద్ద మొత్తంలో నష్టపోయి.. చివరికి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. దీంతో ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వరుస ఘటనలు ఆందోళన కల్గిస్తున్నాయి. దీంతో బెట్టింగ్ యాప్స్ వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయ అంశంగా మారింది.

సినీ సెలబ్రెటీల పై కేసు నమోదు.. లిస్ట్‌లో రానా, మంచు లక్ష్మీ, నిధి అగర్వాల్ కూడా..
Tollywood

Updated on: Jul 10, 2025 | 1:38 PM

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్  కేసులో ఈడీ అధికారులు స్పీడ్ పెంచారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలోనే పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలతో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పై కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో సినీ హీరోలు, హీరోయిన్స్, యాంకర్లు, పలువుడ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఉన్నారు. ఇక బెట్టింటి యాప్స్ ప్రమోషన్స్ కేసులో విజయ్ దేవర కొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మీ, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, శ్రీముఖిప్రణిత, విష్ణు ప్రియలతో పాటు మరికొంతమంది పై కేసు నమోదు చేశారు. ఈ యాప్స్ ను ప్రమోట్ చేయడానికి వీరు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి : జిమ్‌కు వెళ్లడం మానేశా.. ఆ పని చేసి బరువు తగ్గా.. సీక్రెట్ రివీల్ చేసిన స్టార్ హీరోయిన్

అయితే సెలబ్రెటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కోసం తీసుకున్న డబ్బు ఐటీ రిటర్న్స్ లో లేవని అధికారులు గురించారు. ఆ డబ్బుకు సంబంధించి సరైన లెక్కలు లేనందున వారిపై మనీ లాండరింగ్‌ కింద కేసు ఈడీ కేసు నమోదు చేసింది. ఇక బెట్టింగ్ యాప్స్ విషయంలో గతంలో పలువురు సెలబ్రెటీలు విచారించారు అధికారులు. కొంతమందికి నోటీసులు పంపారు. ఆ సమయంలో విజయ్ దేవరకొండ, రానా టీమ్ లో స్పందించాయి.

ఇది కూడా చదవండి : అందంగా లేదని అప్పుడు అవమానించారు.. కట్ చేస్తే ఇప్పుడు అదే బ్రాండ్‌కు అంబాసిడర్‏గా

నిషేదిత బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయలేదని, స్కిల్ డవలప్ గేమ్స్ మాత్రమే ప్రమోట్ చేశారు అని విజయ్ దేవరకొండ టీమ్ తెలిపింది. చట్టపరమైన అనుమతులు ఉన్న యాప్స్ ను మాత్రమే ప్రమోట్ చేశామని విజయ్, రానా టీమ్స్ తెలిపాయి. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తో తాము కుదుర్చుకున్న ఒప్పందం కూడా ముగిసిపోయిందని తెలిపారు. అలాగే ప్రకాష్ రాజ్ కూడా 2016లోనే తాను బెట్టింగ్ యాప్ తో కుదుర్చుకున్న డీల్ అయిపోయిందని తెలిపారు. కాగా ఇప్పుడు మరోసారి ఈడీ అధికారులు ఈ కేసు పై దూకుడు పెంచారు. మరి కేసు నమోదు కావడంపై సినీ సెలబ్రెటీలు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఒకప్పుడు యాంకర్.. ఇప్పుడు స్టార్ హీరోయిన్..! ఒక్క సినిమాకు రూ.25కోట్లు తీసుకుంటున్న బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి