ఆకట్టుకుంటున్న శ్రీ శ్రీ పోస్టర్.. మరో హిట్ కొట్టడానికి రెడీ అయిన దుల్కర్ సల్మాన్
దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే హీరో హీరోయిన్స్ గా, రవి నెలకుదిటి, సుధాకర్ చెరుకూరి, ఎస్ఎల్వి సినిమాస్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ టైటిల్ 'శ్రీ శ్రీ' ప్లజెంట్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది .

వెర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం నూతన దర్శకుడు రవి నెలకుదిటి దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ఎంటర్‌టైనర్ DQ41తో బిజీగా ఉన్నారు. ప్రతిష్టాత్మక ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్, నిర్మాణ సంస్థకు 10వ మైల్ స్టోన్ చిత్రంగా నిలుస్తోంది. ఇషాన్ సక్సేనా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రేమ, వినోదం, మనసుని తాకే భావోద్వేగాలను అందంగా మేళవించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో దుల్కర్ సల్మాన్ సరసన పూజా హెగ్డే తొలిసారిగా నటిస్తున్నారు. ఇంతకుముందు విడుదల చేసిన వర్కింగ్ స్టిల్స్ ఈ జంట మధ్య ఉన్న ఆకట్టుకునే కెమిస్ట్రీ ప్రజెంట్ చేశాయి. ఆ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ.. చిత్ర నిర్మాతలు ఇప్పుడు సినిమా టైటిల్‌తో పాటు, ప్లజెంట్ ఫస్ట్-లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
ఇది కూడా చదవండి : నా పాత్రకు ఇంపార్టెన్స్ లేదు..! కృష్ణ సినిమాకు నో చెప్పింది.. కట్ చేస్తే సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది
ఈ సినిమాకు ‘శ్రీ శ్రీ’ అనే ఆహ్లాదకరమైన టైటిల్ ఖరారు చేశారు. దీనికి “లవ్ విల్ స్పార్క్ అగైన్” అనే ఆకట్టుకునే ట్యాగ్‌లైన్ ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ఇద్దరూ ఒక కాంపౌండ్ గోడపై కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ కనిపిస్తున్నారు. పాస్టెల్ బ్లూ షర్ట్, గ్రే ట్రౌజర్, కళ్లద్దాలతో కనిపిస్తున్న దుల్కర్ సిగ్గరించిన చిరునవ్వుతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తే, లైట్ బ్లూ సల్వార్ సూట్‌లో ఉన్న పూజా హెగ్డే అతని వైపు చూసి మనసారా నవ్వుతూ కనిపిస్తోంది. ఇద్దరి మధ్య ఉన్న సహజమైన కెమిస్ట్రీ పోస్టర్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇది కూడా చదవండి : ఏంటీ..! ఈ సీనియర్ హీరోయిన్ మహేష్ బాబు బంధువా.!! ఇన్నాళ్లు ఈ విషయం చాలా మందికి తెలియదే..
వారి దుస్తులు, హావభావాలను బట్టి ఇద్దరూ క్లాస్‌మేట్స్‌గా కనిపిస్తుండగా, పోస్టర్‌లోని సింపుల్ బ్యాక్‌డ్రాప్ అమాయకత్వం, నాస్టాల్జియా, మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. వారి రిలాక్స్‌డ్ బాడీ లాంగ్వేజ్, సహజమైన చిరునవ్వులు స్నేహం, అనుబంధం, మాటల్లో చెప్పలేని ప్రేమతో నిండిన బంధాన్ని సూచిస్తున్నాయి. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కొత్తదనాన్ని, పాజిటివ్ వైబ్స్‌ను పంచుతూ, దుల్కర్ సల్మాన్-పూజా హెగ్డే జోడీతో ప్రేక్షకులకు మనసును హత్తుకునే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను అందించబోతున్నామని హామీ ఇస్తోంది. ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. అనయ్ ఓం గోస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఈ ముగ్గురి ప్రతిభతో చిత్రం విజువల్‌గా ఎమోషనల్ గా అద్భుతంగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. “శ్రీ శ్రీ” చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీగా విడుదల చేయనున్నారు.
ఇది కూడా చదవండి : ఆర్ఎక్స్ 100 బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నుంచి రావు బహదూర్ వరకు.. అదరగొడుతున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




