Tollywood : సినిమా కోసం 50 రోజులు స్నానం చేయని హీరో.. చివరకు నటుడి వింత ప్రవర్తన.. ఎవరంటే..
సాధారణంగా కంటెంట్ నచ్చితే సినిమా కోసం ఎలాంటి రిస్క్ అయిన చేసే హీరోస్ చాలా అరుదు. సౌత్ టూ నార్త్ వరకు కొందరు స్టార్స్ తమ పాత్రకు న్యాయం చేయడం కోసం ఎంతటి రిస్క్ అయిన చేస్తుంటారు. ఫిట్నెస్, లుక్స్ విషయంలో చాలా మారిపోతుంటారు. కానీ ఓ హీరో మాత్రం తన సినిమా కోసం ఏకంగా 50 రోజులు స్నానం చేయకూడదని నిర్ణయించుకున్నాడట. దీంతో చివరకు వింత వింతగా ప్రవర్తించడం స్టార్ట్ చేశాడట. ఇంతకీ ఈ స్టార్ ఎవరో తెలుసుకుందామా.

సినీరంగంలో చాలా మంది స్టార్స్ తమ సినిమా.. పాత్ర కోసం ఎలాంటి రిస్క్ అయిన చేసేందుకు ముందు ఉంటారు. కొందరు తమ పాత్ర కోసం బరువు తగ్గడం, పెరగడం చూస్తుంటాం. కానీ తన రోల్ కోసం దాదాపు 50 రోజులు స్నానం చేయకుండా ఉన్న హీరో గురించి ఎప్పుడైనా విన్నారా.. ? ఇంతకీ ఆ హీరో ఎవరు.. ? ఆ సినిమా ఏంటీ ? అనేది ఇప్పుడు తెలుసుకుందామా. రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం వహించిన ‘చైనా గేట్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేదు. కానీ అందులో విలన్ పాత్రలో నటించిన వ్యక్తి మాత్రం ప్రేక్షకులపై శాశ్వత ముద్ర వేశారు. ఇందులో విలన్ జాగీరా పాత్రను నటుడు ముఖేష్ తివారీ పోషించారు. ఈ పాత్ర గతంలో సూపర్ హిట్ అయిన షోలే చిత్రంలోని గబ్బర్ సింగ్ పాత్రను గుర్తు చేసింది. ఈ మూవీ విడుదలై 27 సంవత్సరాలు అయినప్పటికీ ఇందులో జాగీరా చెప్పే డైలాగ్స్ మాత్రం అడియన్స్ మనసులో నిలిచిపోయాయి.
అయితే ఈ సినిమాలో ముఖేష్ తివారీ పర్వత ప్రాంతంలో నివసించే క్రూరమైన బందిపోటు జాగీరా పాత్రను పోషించాడు. ఈ పాత్రకు 100% న్యాయం చేయడానికి ముఖేష్ 50 రోజులు స్నానం చేయడం మానేశాడట. పాత్ర కోసం పూర్తిగా మురికిగా కనిపించాడట. అతను స్నానం చేయకపోయినా, దుర్వాసన రాకుండా ఉండటానికి అతను ఎప్పుడూ పెర్ఫ్యూమ్ వాడేవాడట. ఇక షూటింగ్ సమయంలో అతడి చుట్టూ రాబందులు, కాకులు ఎక్కువగా తిరిగేవట. జుట్టును కూడా కత్తిరించుకోలేదు. దీంతో అతడిని చూడగానే ప్రజలు భయంతో పారిపోయేవారు. ఈ చిత్రంలో ముఖేష్ తివారీతో పాటు ఓం పురి, నసీరుద్దీన్ షా, అమ్రిష్ పురి కీలకపాత్రలు పోషించారు.
ఈ సినిమాతో ముఖేష్ తివారీ రాత్రికి రాత్రే స్టార్ అయ్యారు. కానీ ఈ సినిమా తర్వాత రెండేళ్లపాటు మరో ఆఫర్ రాలేదు. రోహిత్ శెట్టి తెరకెక్కించిన గోల్ మాల్ సినిమాలో వాసులి భాయ్ పాత్రతో మరింత ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
ముఖేష్ తివారీ..
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..