Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: అమ్మాయిల అక్రమ రవాణా.. భయంకరమైన క్రైమ్ థ్రిల్లర్.. 2 గంటలు చూస్తే వెన్నులో వణుకే..

ఓటీటీలో టాప్ ట్రెండింగ్‏లో ఎక్కువగా మిస్టరీస్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చే చిన్న సినిమాలు ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్నాయి. స్టార్ హీరో లేకపోయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన చిత్రాలు ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోనూ సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం ఓ మూవీ ఓటీటీలో టాప్ 1లో ట్రెండింగ్ అవుతుంది. ఇంతకీ ఏ సినిమానో తెలుసుకుందామా.

OTT Movie: అమ్మాయిల అక్రమ రవాణా.. భయంకరమైన క్రైమ్ థ్రిల్లర్.. 2 గంటలు చూస్తే వెన్నులో వణుకే..
Bhakshak Movie Ott
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 11, 2025 | 10:02 AM

ప్రస్తుతం సినీప్రియులు కమర్షియల్ సినిమాల కంటే ఎక్కువగా నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన సినిమాలను, వెబ్ సిరీస్ లను ఇష్టపడుతున్నారు. ఈ జానర్ చిత్రాలు వినోదాన్ని అందించడమే కాకుండా ముఖ్యమైన సంఘటనల గురించి తెలియజేస్తున్నాయి. నిజ జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన సినిమాలు ఇప్పుడు ప్రేక్షకుల హృదయాలను తాకుతున్నాయి స్క్రిప్ట్ బాగుంటే అడియన్స్ సైతం కుర్చీకే అతుక్కుపోతున్నారు. ఇక ఇప్పుడు ఓ భయంకరమైన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో సంచలనం సృష్టిస్తుంది. ప్రధాన హీరో లేకపోయినా కొన్నిరోజులుగా ఓటీటీలో నంబర్ వన్ లో ట్రెండింగ్ అవుతుంది. ఆ సినిమా పేరు భక్షక్. ఈ చిత్రాన్ని బీహార్‌లో జరిగిన ఒక నిజమైన సంఘటన ఆధారంగా రూపొందించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

భక్షక్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రాన్ని భయంకరమైన క్రైమ్ థ్రిల్లర్ ముజఫర్‌పూర్ షెల్టర్ కేసు ఆధారంగా తెరకెక్కించారు. డైరెక్టర్ పుల్కిత్ దర్శకత్వం వహించారు. ఈ డార్క్ స్టోరీ అడియన్స్ నుంచి ఎక్కువగా ప్రశంసలు అందుకుంది. అలాగే IMDbలో 7.2 మంచి రేటింగ్ ఉంది. ఈ చిత్రాన్ని షారుఖ్ ఖాన్ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై నిర్మించారు . ఇందులో ఆదిత్య శ్రీవాస్తవ, సంజయ్ మిశ్రా, సాయి తమంహర్, సూర్య శర్మ కీలకపాత్రలు పోషించారు.

కథ విషయానికి వస్తే..

బీహార్ రాష్ట్రంలో నేరాల రేటు ఎక్కువగా ఉంటుంది. హత్య, దోపిడీ, ఆత్యాచారం, మానవ అక్రమ రవాణా వంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. అదే సమయంలో మహిళల భద్రత కోసం షెల్టర్ హెమ్స్ ఏర్పాటు చేస్తారు. వాటి అసలు లక్ష్యం అమ్మాయిలను సురక్షితంగా ఉంచడం. కానీ ఈ ఆశ్రయాల పేరుతోనే అమ్మాయిలను ఆక్రమంగా రవాణా చేస్తుంటారు. ఒక మహిళా జర్నలిస్ట్ (భూమి ఫెడ్నేకర్) ఈ ఆశ్రమాల వెనుక ఉంటే చీకటి కోణాన్ని తెలుసుకుంటుంది. దీంతో ఈ విషయాన్ని బయటకు తీసుకురావడానికి పోరాడుతుంది. ఆ సమయంలో ఆమె ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది..? ఈ ఆశ్రమాల్లో చిక్కుకున్న అమ్మాయిలు ఎలా బయటపడతారు? అనేది సినిమా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిసీన్ ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగిస్తుంది. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే జర్నలిస్ట్ పాత్రలో భూమి పెడ్నేకర్ అద్భుతమైన నటనను కనబరిచారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..