AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఒక్క ఎపిసోడ్‏కు రూ.70 వేలు.. ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్.. ఇప్పుడు క్యాన్సర్‏తో పోరాటం..

బుల్లితెరపై పాపులర్ హీరోయిన్. ఒక్క సీరియల్ ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అంతేకాదు.. ఒక్క ఎపిసోడ్ కోసం రూ.70 వేలు పారితోషికం తీసుకుంది. పెళ్లి చేసుకుని ఇస్లాం మతంలోకి మారిన ఈ అమ్మడు.. ఆ తర్వాత కూడా సీరియల్స్, రియాల్టీ షోలతో బిజీగా ఉండేది. కానీ ఇప్పుడు క్యాన్సర్‏తో పోరాడుతుంది.

Tollywood : ఒక్క ఎపిసోడ్‏కు రూ.70 వేలు.. ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్.. ఇప్పుడు క్యాన్సర్‏తో పోరాటం..
Actress
Rajitha Chanti
|

Updated on: Jun 10, 2025 | 5:57 PM

Share

టీవీ పరిశ్రమలో ఆమె తోపు హీరోయిన్. కేవలం ఒక్క ఎపిసోడ్ కోసం రూ.70,000 పారితోషికం తీసుకుంటూ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. అందం, అద్భుతమైన నటనతో బుల్లితెర ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. చాలా సంవత్సరాలుగా టీవీ పరిశ్రమలో కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోహీరోయిన్స్ రేంజ్ ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు. అయితే కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. కానీ ఆ వివాహం ఎక్కువకాలం సాగలేదు. ఫస్ట్ మ్యారేజ్ నుంచి బయటపడిన తర్వాత తనతోపాటు నటించే నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రియుడిని రెండో వివాహం చేసుకున్న ఈ నటి ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ గడుపుతుంది. వీరికి బాబు ఉన్నారు.

పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడు క్యాన్సర్ సమస్యతో పోరాడుతుంది. ఒకప్పుడు ఎపిసోడ్ కు 70,000 రూపాయలు పారితోషికం తీసుకున్న ఆమె.. ఇప్పుడు క్యాన్సర్ సమస్యకు చికిత్స తీసుకుంటుంది. ఆమె మరెవరో కాదు.. నటి దీపికా కక్కర్. హిందీలో మోస్ట్ పాపులర్ సీరియల్స్ ససురల్ సిమర్ కా, కహాన్ హమ్ కహాన్ తుమ్ ద్వారా పాపులర్ అయ్యింది. ఇప్పుడు దీపికా స్టేజ్ 2 లివర్ క్యాన్సర్ తో పోరాడుతుంది. కొన్ని నెలలుగా ఆమె చికిత్స తీసుకుంటుంది. దీపిక కాలేయంలోని ఎడమ భాగంలో టెన్నిస్ బంతి పరిమాణంలో పెద్ద కణితి ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. దీంతో ఆమెకు దాదాపు 14 గంటలు శస్త్ర చికిత్స చేశారట.

క్యాన్సర్ సమస్య ఉన్నట్లు నిర్దారణ కావడానికి ముందు దీపిక సెలబ్రెటీ మాస్టర్ చెఫ్ లో పనిచేసింది. కానీ ఆ షోను సగంలోనే వదిలేసింది. 2011లో రౌనక్ శర్మను వివాహం చేసుకున్న దీపిక.. 2015లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత నటుడు షోయబ్ ఇబ్రహీంను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇస్లాం మతంలోకి మారిన తర్వాత దీపిక తన పేరును ఫైజాగా మార్చుకుంది. 2023లో బాబుకు జన్మనిచ్చింది దీపిక.

View this post on Instagram

A post shared by Dipika (@ms.dipika)

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..