AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shivani Nagaram : లిటిల్ హార్ట్స్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు.. అయినా ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి కారణం ఇదే.. శివానీ నాగారం

ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిన్న సినిమా 'లిటిల్ హార్ట్స్'. కొన్ని రోజుల క్రితం ఈ చిత్రం ఊహించని సక్సెస్ అందుకుంది. తొలిరోజే బ్రేక్ ఈవెన్ అయ్యింది. అయితే ఈ మూవీలో లీడ్ రోల్స్ చేసిన మౌళి, శివాని నాగారంతో పాటు హీరో ఫ్రెండ్‌గా చేసిన జయకృష్ణని అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాతో పాపులర్ అయ్యింది శివాని నాగరం..

Shivani Nagaram : లిటిల్ హార్ట్స్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు.. అయినా ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి కారణం ఇదే.. శివానీ నాగారం
Shivani Nagaram
Rajitha Chanti
|

Updated on: Feb 13, 2026 | 2:32 PM

Share

హీరోయిన్ శివాని నాగారం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఒక్క సినిమాతోనే సెన్సేషన్ అయ్యింది. లిటిల్ హార్ట్స్ సినిమాతో తెలుగులో పాపులర్ అయ్యింది. ఇప్పుడు హే భగవాన్ సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ.. తన ప్రయాణం, కెరీర్ ఎదుగుదలపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్ వృద్ధి గురించి మాట్లాడుతూ, 2024లో నటిగా మంచి అరంగేట్రం చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నానని, 2025 నాటికి మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నానని, 2026 నాటికి పూర్తి కమర్షియల్ నటిగా మారుతున్నట్లు అనిపిస్తుందని అన్నారు. తాను సినిమాల ఎంపికలో “క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ”కి ప్రాధాన్యత ఇస్తానని, ఎన్ని సినిమాల్లో నటించామన్నది కాదని, ఎలాంటి కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించామన్నదే ముఖ్యమని నమ్ముతానని వెల్లడించారు.

ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో సంచలనంగా మారింది..

ప్రస్తుతం తాను నటిస్తున్న హే భగవాన్ చిత్రం గురించి మాట్లాడుతూ, సినిమాలో ఒక మిస్టరీ బిజినెస్ ఉందని, సుహాస్ వాయిస్‌తో వచ్చే డిస్‌క్లెయిమర్ వల్ల దానిపై ప్రేక్షకుల్లో తీవ్రమైన ఆసక్తి నెలకొందని తెలిపారు. ఆ బిజినెస్ ఏమిటని చాలా మంది అడుగుతున్నారని, అయితే అది సినిమా చూస్తేనే దాని కిక్ తెలుస్తుందని, మొదటి అర్ధభాగంలోనే ఆ రహస్యం వీడుతుందని శివాని పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..

ఈ చిత్రంలో తన పాత్ర ఒక సాంప్రదాయక, పద్ధతైన కుటుంబానికి చెందిన అమ్మాయి అని, తన తల్లిదండ్రులు తెలుగు భాషను బాగా ఇష్టపడతారని వివరించారు. ఇప్పుడే కెరీర్‌ స్టార్ట్‌ అయింది కదా.. నేనింకా యాక్టింగ్‌ లో చాలా నేర్చుకోవాలి. నిత్యవిద్యార్థినిగా ఉండేందుకు సిద్ధంగా ఉంటాను. నా దృష్టిలో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు రెండూ గొప్పవే. నటిగా నన్ను మలచుకుంటూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తాననే నమ్మకం నాకుంది. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలి. వచ్చి మంచి సక్సెస్‌ ఫుల్‌ సినిమాలు చేయాలని ఎప్పుడూ కోరుకుంటాను. కాలేజీ రోజుల్నుంచే నాకు యాక్టింగ్‌ అంటే ఇష్టం ఉండేది. దాన్ని మా కుటుంబ సభ్యులూ ప్రోత్సహించారు. వాళ్లు నన్నెప్పుడూ సపోర్ట్‌ చేస్తూనే ఉంటారు అని చెప్పుకొచ్చింది.

ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..

ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..

Follow Us
3 జట్లు ఔట్.. 2 టీంలు సేఫ్.. 5 జట్ల మధ్య కీలక పోరు..!
3 జట్లు ఔట్.. 2 టీంలు సేఫ్.. 5 జట్ల మధ్య కీలక పోరు..!
మల్లె చెట్టుకు గుత్తులు గుత్తులుగా పూలు పూయాలా? చాక్ పీస్ చిట్కా
మల్లె చెట్టుకు గుత్తులు గుత్తులుగా పూలు పూయాలా? చాక్ పీస్ చిట్కా
TG ECET 2026 హాల్‌ టికెట్లు వచ్చేశాయ్‌.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
TG ECET 2026 హాల్‌ టికెట్లు వచ్చేశాయ్‌.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
అపర ఏకాదశి స్పెషల్.. పారిజాత యోగంతో ఈ రాశులకు గోల్డెన్ టైమ్,.
అపర ఏకాదశి స్పెషల్.. పారిజాత యోగంతో ఈ రాశులకు గోల్డెన్ టైమ్,.
హైదరాబాద్‌లో ప్రధాని మోదీ.. లైవ్ వీడియో
హైదరాబాద్‌లో ప్రధాని మోదీ.. లైవ్ వీడియో
టాస్ గెలిచిన చెన్నై.. లక్నోతో పోరులో రుతురాజ్ సేన వ్యూహం ఇదే..!
టాస్ గెలిచిన చెన్నై.. లక్నోతో పోరులో రుతురాజ్ సేన వ్యూహం ఇదే..!
ఇంటి బాత్రూంలో కుప్పులుగా నోట్ల కట్టలు.. దెబ్బకు కెరీర్ క్లోజ్..
ఇంటి బాత్రూంలో కుప్పులుగా నోట్ల కట్టలు.. దెబ్బకు కెరీర్ క్లోజ్..
CBSE 12వ తరగతి 2026 ఫలితాలపై వీడిన ఉత్కంఠ.. ముహూర్తం ఫిక్స్!
CBSE 12వ తరగతి 2026 ఫలితాలపై వీడిన ఉత్కంఠ.. ముహూర్తం ఫిక్స్!
కోట్లు కుమ్మరించినా కొంపముంచిన నలుగురు.. ఇంత దిగజారిపోయారేంట్రా.!
కోట్లు కుమ్మరించినా కొంపముంచిన నలుగురు.. ఇంత దిగజారిపోయారేంట్రా.!
సామాన్యులపై ధరల వాత.. మళ్లీ పెరగనున్న నిత్యవసరాల ధరలు
సామాన్యులపై ధరల వాత.. మళ్లీ పెరగనున్న నిత్యవసరాల ధరలు