Geetha Govindam: గీతా గోవిందం సినిమాలో విజయ్ చెల్లెలు గుర్తుందా ?.. ఏ రేంజ్‏లో మారిందో చూశారా..

మ్యూజికల్ హిట్ అయిన ఈ మూవీలో విజయ్ చెల్లిగా నటించి ఓ అమ్మాయి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఈ సినిమాతో ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఇంతకీ ఆ అమ్మాయి పేరు ఏంటీ ? ఇప్పుడేం చేస్తుంది అనుకుంటున్నారా ? ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Geetha Govindam: గీతా గోవిందం సినిమాలో విజయ్ చెల్లెలు గుర్తుందా ?.. ఏ రేంజ్‏లో మారిందో చూశారా..
Geetha Govindam
Follow us

|

Updated on: May 10, 2024 | 8:12 PM

కెరీర్ మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి ఇప్పుడు హీరోగా స్టార్ డమ్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమాతో కథానాయకుడిగా వెండితెరకు పరిచయమైన విజయ్… ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా రూపొందించిన అర్జున్ రెడ్డి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ అప్పట్లో యూత్‏కు తెగ నచ్చేసింది. ఆ తర్వాత డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం గీతా గోవిందం సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాడు విజయ్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటించగా.. సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించారు. మ్యూజికల్ హిట్ అయిన ఈ మూవీలో విజయ్ చెల్లిగా నటించి ఓ అమ్మాయి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఈ సినిమాతో ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఇంతకీ ఆ అమ్మాయి పేరు ఏంటీ ? ఇప్పుడేం చేస్తుంది అనుకుంటున్నారా ? ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గీతా గోవిందం సినిమాలో విజయ్ చెల్లెలుగా కనిపించిన అమ్మాయి పేరు మౌర్యని. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ విజయ్ చెల్లిగా చూడటానికి అచ్చ తెలుగు అమ్మాయిల కనిపించిన మౌర్యని కన్నడ బ్యూటీ. ఇంటర్ చదువుతున్న సమయంలోనే సినిమాల్లో అవకాశం రావడంతో చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2016లో అర్ధనారి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఇందులో మౌర్యనీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది.

తెలుగులో అల్లరి నరేష్ నటించిన ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమాలో సెకండ్ హీరోయిన్ కనిపించింది. ఇందులో దెయ్యం పాత్రలో అద్భుతంగా నటించింది. ఇవే కాకుండా తెలుగులో నెల్లూరి పెద్దారెడ్డి, గీత గోవిందం, జానకి రాముడు, క్రాక్, దేవరకొండలో విజయ్ ప్రేమకథ, సుందరాంగుడు, అందరూ బాగుండాలి అందులో నేనుండాలి చిత్రాల్లో నటించింది. అయితే విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం సినిమాతో మౌర్యనికి మంచి గుర్తింపు వచ్చింది. అలాగే తెలుగు సినిమాల్లో ఇప్పటికీ నటిస్తుంది మౌర్యనీ..

తెలుగులో ఆమె చివరిసారిగా నేడే విడుదల చిత్రంలో కనిపించింది. ఈ మూవీ 2023లో రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి అవకాశాలు రాలేదు. అయితే సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం సందడి చేస్తుంది మౌర్యని. ఎప్పుడూ ఫోటోషూట్స్, రీల్స్ షేర్ చేస్తు యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా మౌర్యనీ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఇప్పటికీ మౌర్యనీ గ్లామర్ షోకు దూరంగా ఉంటూనే ట్రెడిషనల్ లుక్స్ ఫోటోస్ షేర్ చేస్తూ కనిపిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ